Tecno Camon 50 Ultra 5G: ప్రమఖ మొబైల్ బ్రాండ్ టెక్నో (Tecno) నుంచి సరికొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదలైంది. ఈ ఫోన్ లో అద్భుతమైన కెమెరా ఫీచర్లు, భారీ బ్యాటరీ సామర్థ్యంతో వినియోగదారులను విపరీతంగా ఆకట్టకుంటోంది. మిడ్ ప్రీమియం కేటగిరీలో రిలీజ్ అయిన ఈ ఫోన్‌కు సంబంధించిన ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..
టెక్నో నంచి Tecno Camon 50 Ultra 5G వినియోగదారలకు అందుబాటులోకి వచ్చింది. మిడిల్ క్లాస్ పీపుల్స్ ను దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన ఇందులో 6.78 అంగుళాల Curved AMOLED డిస్ ప్లేను చూడొచ్చు. ఇది 1.5K రిజల్యూషన్ తో 144Hz రిఫ్రెష్ రేట్ తో ఉండడం వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను అందించారు. ఈ ఫోన్ కేవలం 7.75mm మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది.
Tecno నుంచి మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆల్టిమేట్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ మేజర్ అప్‌డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని టెక్నో హామీ ఇచ్చింది.
దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ తో ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా , 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో కూడా ఆటో ఫోకస్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ కెమెరా ను అందించారు. ఇందులో 6,500mAh భారీ బ్యాటరీ ఉండగా.. సింగిల్ ఛార్జ్‌పై రెండు రోజులకు పైగా బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడం కోసం 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది.
భారత మార్కెట్లో టెక్నో కామన్ 50 ఆల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 39,999 గా నిర్ణయించారు. అయితే, లాంచ్ ఆఫర్ కింద కంపెనీ రూ. 3,000 విలువైన డిస్కౌంట్ కూపన్‌ను అందిస్తోంది. దీనితో ఈ ఫోన్‌ను రూ. 36,999 కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఇండియా (Amazon) ద్వారా జూలై 21 నుండి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
