Realme 16 Pro: ప్రస్తుత కాలంలో చాలామందికి మొబైల్ అవసరం తప్పనిసరిగా మారింది. ఉద్యోగులు, వ్యాపారులు తమ కార్యకలాపాలలో మొబైల్ కీలకంగా ఉంటుంది. అయితే అందరూ ఒకే రకమైన మొబైల్ కొనడానికి ఆస్కారం లేదు. కొందరు లగ్జరీ మొబైల్ కొనాలని చూస్తే మరికొందరు బడ్జెట్ కు అనుగుణంగా ఫోన్ కొంటారు. వీరికి అనుకూలంగా కొన్ని కంపెనీలు తక్కువ ధరలో మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తూ ఉంటాయి. ఇలా బడ్జెట్లో తీసుకువచ్చే కంపెనీలో Realme ఒకటి. ఈ కంపెనీ నుంచి గత ఏడాది మే నెలలో 16 ప్రో లాంచ్ అయింది. అయితే ఇటీవల దీని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఈ మొబైల్ ఉందని చెబుతున్నారు. నేటి తరం వారికి అనుగుణంగా ఫీచర్స్ తో పాటు ధర కూడా బడ్జెట్లోనే ఉందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఈ మొబైల్ ఎలా ఉందంటే?
Realme 16 Pro మొబైల్ లో ఫీచర్స్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో 6.78 అంగుళాల AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. మూవీస్ చూసేవారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి ఈ డిస్ప్లే అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఎలాంటి వాతావరణం లోనైనా అద్భుతమైన కాంతిని అందిస్తుంది. ఇందులో 7300 మీడియాటెక్ డైమెన్సిటీ మాక్స్ ప్రాసెసర్ ఉంచారు. దీంతో ఒకేసారి ఎన్నో రకాల యాప్స్ ఉపయోగించినా కూడా మొబైల్ వేగం తగ్గకుండా ఉంటుంది.
ఈ మొబైల్లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.200 MP మెయిన్ కెమెరా అమర్చారు. 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా తో కనిపిస్తుంది.50 MP సెల్ఫీతోపాటు వీడియో కాలింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో 7000 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 80 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. రోజువారి వినియోగదారులతో పాటు ఉద్యోగులకు, బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. అయితే ఈ మొబైల్ ధర రూ.31,999 నుంచి రూ.34,999 వరకు విక్రయిస్తున్నారు. మిడ్ రేంజ్ పీపుల్స్ ప్రీమియం ఫీచర్లు కావాలని అనుకుంటే ఈ మొబైల్ ఎంచుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.