RBI Interest Rates: ఆర్బిఐ వడ్డీ రేటులను తగ్గించడంతో వీటి ప్రభావం ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా పడనుంది. మనదేశంలో సీనియర్ సిటిజన్ చాలామందికి ఎన్నో రకాల పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఎక్కువగా ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రైవేటు సంస్థలలో పనిచేసే వారు అలాగే ఏవైనా వ్యాపారాలు చేసేవారు తమ జీవితంలో పొదుపు చేసుకున్న డబ్బులను బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుబడిపెట్టి వాటిపై వచ్చే వడ్డీ ఆదాయంతో వాళ్లు జీవనం సాగిస్తూ ఉంటారు. మన దేశంలో చాలావరకు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలలో అలాగే ప్రభుత్వా రంగు బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ లో పెట్టుబడి చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటులను భారీగా తగ్గించిన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read: SBI న్యూ రూల్స్…ఇకపై డబ్బులు తీసుకోవాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే..
ఆర్బిఐ వడ్డీ రేట్లు తగ్గించిన కారణంగా దేశంలో ఉన్న అనేక బ్యాంకులు కూడా తమ బ్యాంకులో ఉన్న ఫిక్స్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం బాగా కనిపిస్తుంది. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును 0.25% తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.5 శాతం వడ్డీ రేటులను తగ్గించినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 0.75 శాతం వడ్డీ రేట్లు తగ్గాయి. ఈ ప్రభావం ఫిక్స్డ్ డిపాజిట్ లపై కూడా బాగా పడేలాగా కనిపిస్తుంది. అనేక బ్యాంకులలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లపై 0.5% వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు ఈ కొత్త వడ్డీ రేటులను అమలులోకి తెచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లపై భారీగా వడ్డీ రేట్లు తగ్గుతాయి. దీంతో నెల నెల వడ్డీ ఆదాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఇది షాపింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న వారికి మాత్రం ఇది కొంచెం ఊరట కలిగించే వార్త అని తెలుస్తుంది. తగ్గిన వడ్డీ రేట్లు ఇంటిపై రుణం అలాగే వాహన రుణాలు తీసుకున్న వాళ్లకి ఊరట కలిగిస్తున్నాయి.