https://oktelugu.com/

Credit Card Users: క్రెడిట్ కార్డు వాడేవారికి షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. ఇక నుంచి లోన్లు బంద్..!

బ్యాంకులన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పర్యవేక్షిస్తుంది. ప్రతీ బ్యాంకు చేసే పనితీరును పసిగడుతుంది. ఈ క్రమంలో ఏ బ్యాంకు ఎన్ని క్రెడిట్ కార్డులు జారీ చేసిందో ఇటీవల పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.

Written By:
  • Srinivas
  • , Updated On : June 24, 2023 / 04:15 PM IST

    Credit Card Users

    Follow us on

    Credit Card Users: భారతదేశంలో కరోనా తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మనీ ట్రాన్ష్ ఫర్ విషయంలో చాలా మంది చేతితో కాకుండా అన్లైన్ ద్వారా చెల్లిస్తున్నారు. ఇలా ఆన్లైన్ చెల్లింపులను భట్టి బ్యాంకులు కస్టమర్ల ఖాతా పనితీరును పరిశీలిస్తున్నారు. ఖాతాదారులు బ్యాలెన్స్ ను మెయింటేన్ చేయడంతో పాటు వారు చేసే ట్రాన్సాక్షన్లపై కొన్ని ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా కొంతమంది కస్టమర్లను ఎంపిక చేసి క్రెడిట్ కార్డులను ఎలాంటి ప్రాసెస్ ఫీజుల లేకుండా జారీ చేస్తోంది. క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులనుకొనుగోలు చేయడంతో పాటు తక్కువ వడ్డీతో మనీని తీసుకునే అవకాశం ఉండడంతో చాలా మంది ఈ కార్డు ద్వారా పర్సనల్ లోన్ ను తీసుకుంటున్నారు. ఈమధ్య ఇలాంటి వారి సంఖ్య పరిమితికి మించింది. దీంతో ఆర్బీఐ పలు ఆంక్షలను జారీ చేసింది.

    బ్యాంకులన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పర్యవేక్షిస్తుంది. ప్రతీ బ్యాంకు చేసే పనితీరును పసిగడుతుంది. ఈ క్రమంలో ఏ బ్యాంకు ఎన్ని క్రెడిట్ కార్డులు జారీ చేసిందో ఇటీవల పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల తేలిన ప్రకారం అన్నింటికంటే ముందు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఉండగా.. ఆ తరువాత ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల నుంచి కోట్లాది వినియోగదారులు క్రెడిట్ కార్డులు కలిగి ఉన్నారు.

    వాస్తవానికి క్రెడిట్ కార్డులు షాపింగ్ తో పాటు వస్తువులను కొనుగోలు చేయడానికి జారీ చేస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో తక్కువ వడ్డీతో మనీని తీసుకునేందుకు అవకాశం ఇస్తారు.అయితే చాలా మంది ఇదే అదనుగా పర్సనల్ లోన్ తీసుకోవడం ప్రారంభించారు. క్రెడిట్ కార్డుపై ఉన్న లిమిట్ ఆధారంగా బ్యాంకులు సైతం లోన్లు ఇవ్వడంతో చాలా మంది తమ అవసరాలకు ఇతరులను అడిగే బదులు ఇలా లోన్లు తీసుకున్నారు. అయితే ఇవి మితిమిరినట్లు ఆర్బీఐ భావిస్తోంది.

    2023 ఫిబ్రవరి వరకు లెక్కలు చూస్తే పర్సనల్ లోన్స్ రూ.33 లక్షల కోట్ల నుంచి రూ.40 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ లోన్లనీ అన్ సెక్యూర్డ్ లోన్స్ కావడంతో వడ్డీ రేట్లు అధికంగానే ఉంటుంది. అయినా చాలా మంది వినియోగదారులు విచ్చల విడిగా లోన్లను తీసుకున్నారు. అయితే ఇలా జరిగితే ఆర్థిక పరమైన చిక్కులు వచ్చే ప్రమాదముందని ఆర్బీఐ తెలిపింది. దీంతో క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ తీసుకునేవారి విషయంలో ఆంక్షనలు జారీ చేయాలని బ్యాంకులకు సూచించిందట. అంటే ఇక నుంచి సులభతరంగా లోన్లు వచ్చే అవకాశం లేదన్న చర్చ సాగుతోంది.