Tata Nano: ఆటోమోబైల్ రంగంలో అతి తక్కువ ధరకే Nano కారును అందించిన Tata కంపెనీ ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమయింది. ఇదే పేరుతో కొత్త కారును వినియోగదారులకు అందించేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ కారు గురించి వివరాలను ప్రకటించిన Tata మరికొద్ది రోజులలో దీనిని వినియోగదారుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ చేస్తుంది. అయితే ఈ కారు అతి తక్కువ ధరకు లభించడమే కాకుండా.. అధునాతన ఫీచర్లు, ఇంజన్ సామర్థ్యం మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉన్నాయి. గతంలో వచ్చిన నానో కంటే అప్డేట్ ఫీచర్స్ తో ఉన్న దీని గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..
పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియెంట్ లో వస్తున్న Tata Nano అర్బన్ వినియోగదారులకు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో 150 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒకసారి చార్జింగ్ చేస్తే 550 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. పట్టణ లేదా నగర ప్రయాణికులతో పాటు కాస్త లాంగ్ డ్రైవ్ చేసే వారికి కూడా అనుగుణంగా ఉంటూ మైలేజ్ ఇస్తుంది. పాత నానో కంటే కొత్త కారు ఆకర్షణీయమైన డిజైన్తో ఉంటుంది. మెకానిక్ కాంపాక్ట్ రూపంలో వస్తున్న ఇందులో LED హెడ్ లాంప్స్, స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్ ఆకట్టుకుంటాయి. చూడడానికి కాంపాక్ట్ పరిమాణం అయినప్పటికీ.. క్యాబిన్ విశాలంగా ఉంటుంది. రోజువారి ప్రయాణం చేసే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది.
టాటా కొత్త naano ఇన్నర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. పూర్తిగా స్మార్ట్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అమర్చారు. స్మార్ట్ నావిగేషన్ తోపాటు EV కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇది క్లైమేట్ కంట్రోల్ తో పాటు.. సౌకర్యవంతమైన స్వీట్లు.. విశాలమైన డోర్స్ ఉండడంతో ఇన్ లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి సులభంగా ఉంటుంది. అలాగే సేఫ్టీ కోసం ఈ కారులో ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్, ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్, ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటివి ఉన్నాయి. ఓవర్ చార్జింగ్ అవసరం లేకుండా, ఓవర్ హీట్ కాకుండా బ్యాటరీ ఎప్పటికప్పుడు రక్షణ వ్యవస్థను ఉంచుతూ కారును సేఫ్టీ లో ఉంచుతుంది.
టాటా కంపెనీ నుంచి ఇదివరకే వచ్చిన నానో రూ. లక్షతో విక్రయించారు. కానీ కొత్త కారులో అనేక ఆధునిక ఫీచర్లు ఉండడంతో దీనిని రూ.2.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే మహీంద్రా eKUV, MG commet వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే రిలీజ్ తేదీని ప్రత్యేకంగా ప్రకటించకపోయినప్పటికీ.. త్వరలోనే ఇది అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ పేర్కొంటుంది.