Motorola Edge 70: కొత్త సంవత్సరం తో పాటు క్రిస్టమస్, సంక్రాంతి పండుగలు వస్తున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు తమ వస్తువులను విక్రయించడానికి ముందుకు వస్తాయి. ఈ తరుణంలో మొబైల్ కంపెనీలు కొత్త ప్రోడక్ట్ ను పరిచయం చేయాలని చూపిస్తాయి. ఇందులో భాగంగా Motorola కంపెనీకి చెందిన ఓ మొబైల్ అత్యధిక ఫీచర్లతో పాటు.. ఆకట్టుకునే కెమెరాతో మార్కెట్లోకి వచ్చింది. దీని ఫీచర్లో ఇప్పటికే ఆన్లైన్లో ఉంచడంతో.. చాలామంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చెబుతున్నారు. ముఖ్యంగా యూత్ ఫోటోగ్రఫీ కోసం ఈ మొబైల్ ను పెంచుకుంటున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఇంతకీ ఈ మొబైల్ ఎలా ఉందంటే?
ప్రతి మొబైల్ కు డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మోటోరోలా కంపెనీకి చెందిన ఎడ్జ్ 70 పేరుతో మార్కెట్లోకి వచ్చిన మీ మొబైల్ 20 Hz 6.7 అంగుళాల 1.5 Amoled Display తో ఆకట్టుకుంటుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 7జెన్ 4 చిప్ సెట్ ను అమర్చారు. అలాగే ఈ మొబైల్ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో 50 మెగాపిక్చల్ త్రిబుల్ కెమెరాతో ఆకట్టుకుంటుంది. 50 ఎంపీ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాని కూడా అమర్చారు. పోటోగ్రఫీ తో పాటు వీడియో కోరుకునే వారికి అనుకున్న విధంగా స్నాప్ అవుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది కెమెరా కోరుకుంటున్నారు. వారికి అనుగుణంగా ఇందులో కెమెరాను అమర్చారు.
అలాగే ఇందులో 5,000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ నీ అమర్చారు. దీని సామర్థ్యం 68 వాట్ వైరెడ్ చార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యు ఐ పై పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. బ్రైట్నెస్ విషయానికి వస్తే 120 హెచ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండగా.. 4500 nits peak బ్రైట్నెస్ను ఇస్తుంది. అలాగే ఈ మొబైల్ 68 ప్లస్ ఐపి, 69 రేటింగ్ను కలిగి ఉంది. ఇక ఈ మొబైల్ ను సొంతం చేసుకోవాలంటే రూ. 29, 999 ధర చెల్లించాల్సిందే. అయితే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై కొనుగోలు చేస్తే రూ. 750 వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. ఫ్లిప్కార్ట్ పై కొనుగోలు చేసినా.. ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఈ మొబైల్ ఆకర్షణ ఏమైనా రంగుల్లో అందుబాటులో ఉంది.