RBI (1)
RBI: నిత్యావసర సరుకుల ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్‌బీఐ మరో భారం మోపబోతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా.. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి మరో ముఖ్యమైన ప్రకటన వెలువడింది. మే 1, 2025 నుంచి ఏటీఎం లావాదేవీలపై చార్జీలను పెంచాలని RBI బ్యాంకులకు అనుమతినిచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం ఏటీఎం నిర్వహణ ఖర్చులు, ఇంటర్‌చేంజ్ ఫీజుల పెరుగుదలను బ్యాంకులకు భర్తీ చేయడానికి తీసుకోబడింది.
ప్రస్తుతం, (ATM) నిబంధనల ప్రకారం, కస్టమర్లు తమ బ్యాంక్ ఏటీఎంల నుంచి నెలకు ఐదు ఉచిత లావాదేవీలు (ఆర్థిక, అనార్థిక రెండూ కలిపి) చేయవచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలలో మెట్రో నగరాల్లో మూడు, నాన్–మెట్రో ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలు అనుమతించబడతాయి. ఈ ఉచిత పరిమితిని దాటితే, ప్రస్తుతం రూ.21 + జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కానీ, మే 1 నుంచి ఈ చార్జీలు మరింత పెరగనున్నాయి. ఇంటర్‌చేంజ్ ఫీజు రూ.17 నుంచి రూ.23కి పెరగవచ్చని, దీని ప్రభావం కస్టమర్ చార్జీలపై కూడా పడవచ్చని అంచనా.ఈ చార్జీల పెంపు ఏటీఎం సేవలను నిర్వహించే బ్యాంకులు, వైట్–లేబుల్ ఏటీఎం(ATM) ఆపరేటర్లకు పెరిగిన ఖర్చులను భర్తీ చేయడానికి ఉద్దేశించినది.
Also Read: జగన్ అడ్డాలో క్యాంపు పాలిటిక్స్.. గట్టిగానే కూటమి సవాల్!
అధికారికంగా ప్రకటిస్తేనే..
అయితే, కచ్చితమైన కొత్త చార్జీలు ఎంత ఉంటాయన్నది ఇంకా అధికారికంగా ధవీకరించబడలేదు. గతంలో 2022 జనవరి 1 నుంచి రూ.20 నుంచి రూ.21కి చార్జీలు పెంచిన సందర్భం ఉంది, ఇప్పుడు మరోసారి సవరణ జరగనుంది. ఈ నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి, ముఖ్యంగా తరచూ నగదు ఉపసంహరణలు చేసే వారిపై ఇది ప్రభావం చూపవచ్చు. కస్టమర్లు ఈ చార్జీలను తప్పించుకోవడానికి ్ఖ్కఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఎక్కువగా ఉపయోగించాలని సూచనలు వస్తున్నాయి. ఈ విషయంలో ఖఆఐ నుంచి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.