https://oktelugu.com/

Radha Kishan Damani : ఆ వారం రోజులు ఆగితే D-Mart ఉండేది కాదు.. ఓ వ్యాపార దిగ్గజం కథ ఇదీ

రాధాకిషన్ దమానీ ఓ సందర్భంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఓ వారం రోజుల పాటు నిర్లక్ష్యంగా ఉంటే ఈ స్థితిలో ఉండేవాడిని కాదని అన్నారు. ఇంతకీ ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే.

Written By:
  • Srinivas
  • , Updated On : September 13, 2024 / 02:47 PM IST

    Radha Kishan Damani

    Follow us on

    Radha Kishan Damani : నిత్యావసరాల సరుకులు విక్రయాల్లో దిగ్గజంగా నిలుస్తున్న కంపెనీల్లో D-Mart ఒకటి. దేశవ్యాప్తంగా విస్తరించిన డీ మార్ట్ సంస్థలను ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. మిగతా కంపెనీల కంటే డీ మార్ట్ కంపెనీల్లో తక్కువ ధరలతో పాటు అన్నీ వస్తువులు ఒకే చోట లభ్యమయ్యే విధంగా అందుబాటులో ఉంటోంది. 2024 ప్రకారం దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 365 మార్ట్ లతో కలిగి ఉన్న డీమార్ట్ గురించి చాలా మందికి తెలుసు. కానీ దీని అధినేత రాధా కిషన్ గురించి చాలా తక్కువ మందికే పరిచయం ఉంటుంది. సాధారణ వ్యాపారి నుంచి దేశంలోని కుబేరుల పక్కన ఉన్న రాధాకిషన్ దమానీ స్వయం కృషితోనే ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయగలిగారు. అయితే రాధాకిషన్ దమానీ ఓ సందర్భంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఓ వారం రోజుల పాటు నిర్లక్ష్యంగా ఉంటే ఈ స్థితిలో ఉండేవాడిని కాదని అన్నారు. ఇంతకీ ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

    దేశంలోని కుబేరుల్లో ఒకరైన రాధా కిషన్ దమానీకి చదువంటే ఇష్టం లేదు. అయితే ఈయన తండ్రి చిన్న తరహా స్టాక్ మార్కెట్ వ్యాపారాన్ని చేసేవారు. కానీ ఈ స్టాక్ మార్కెట్ పై రాధాకిషన్ దమానీకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే కోరిక ఉండేది. అయితే అతని తండ్రి ఆకస్మికంగా మరణించడంతో రాధాకిషన్ దమాని తండ్రి వ్యాపారాన్ని చేయాల్సి వచ్చింది.

    అయితే రాధాకిషన్ దమానీ స్టాక్ బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించిన తరువాత ఎక్కువగా హర్షద్ మెహతా సంస్థల్లో పెట్టుబడులు పెట్టేవారు. అయితే కొన్నాళ్ల తరువాత హర్షత్ మెహతా కుంభకోణం బయటపడింది. కానీ ఇది జరిగే వారం రోజుల మందు రాధాకిషన్ దమాని తన షేర్స్ అమ్మేశాడు. దీంతో అయన నష్టం నుంచి బయటపడాల్సి వచ్చేది. అంతే ఒక వారం రోజులు ఆలస్యం అయితే రాధా కిషన్ దమాని తీవ్రంగా నష్టపోయేవారు. ఇప్పుడీ పరిస్థితుల్లో ఉండేవారు కాదు.

    అయితే రాధాకిషన్ దమాని ఆ తరువాత చంద్రకాంత్ సంపత్ చెప్పిన సూచనలు పాటించారు. ఒక స్టాక్ మార్కెట్ లో పెట్టుబుడులు పెట్టిన తరువాత 5 నుంచి 10 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలని అన్నారు. దీంతో రాధాకిషన్ దమాని తాను ఇన్వెస్ట్ మెంట్ చేసిన తరువాత కొన్నాళ్ల పాటు వెయిట్ చేశారు. ఆ తరువాత తన పెట్టుబడుల నుంచి అధికంగా లాభాలు వచ్చాయి. ఆ తరువాత ఒక స్టేజికి వచ్చిన తరువాత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అదే బాల్ బేరింగ్ పరిశ్రమ. ఈ వ్యాపారాన్ని ప్రారంభించి కొన్నాళ్లు వెయిట్ చేశారు.

    ఆ తరువాత ముంబైలోని పోవాయ్ లో తక్కువ ధరకు ఓ భూమిని కొనుగోలు చేసి డీ మార్ట్ ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రాధా కిషన్ దమాని దశ తిరిగింది. ఆ తరువాత ఈ వ్యాపారానికి సంబంధించి కీలక సూత్రాలను నేర్చుకొని అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం దేశంలోని 11 రాష్ట్రాల్లో డీ మార్ట్ తన హవా చూపిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రతీరోజూ 1.6 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం.