Blink It : అందుకే బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు.. మనిషి పుట్టుకే ఒక బిజినెస్.. చివరికి చనిపోవడం బిజినెస్సే అని చెప్తాడు.. ఈ సూత్రాన్ని ప్రాథమికంగా గుర్తించాయో.. లేక అందులో ఉన్న వ్యాపారాన్ని పసిగట్టాయో తెలియదు కానీ.. అంకుర సంస్థలు సరికొత్త వ్యాపారాలను అమలుచేస్తున్నాయి. ఇప్పటికే ఓయో హాస్పిటాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ ఈ కామర్స్ అనే వ్యాపారాన్ని తెరపైకి తెచ్చింది. బ్లింక్ ఇట్ అయితే అయిదు నిమిషాల్లో కోరుకున్న గ్రాసరీలను కళ్ళ ముందు ఉంచుతోంది.. స్విగ్గి, జొమాటో వంటివి అప్పటికప్పుడు వేడివేడి ఆహార పదార్థాలను మన ఇంటికి తెచ్చిస్తున్నాయి. ఇక ఈ రంగంలో ఎన్ని మార్పులు వస్తాయి తెలియదు కానీ.. ఇప్పటికైతే మనిషి జీవితాన్ని సమూలంగా అవి మార్చేశాయి. హాస్పిటాలిటీ, ఫుడ్, గ్రాసరీ విభాగాలలో సరికొత్త సంచలనం సృష్టిస్తున్న అంకుర సంస్థలు.. ఇప్పుడు అంబులెన్సు భాగంలోకి కూడా ప్రవేశించాయి. అయితే ఇందులోకి బ్లింక్ ఇట్ వచ్చేసింది. తన సర్వీసులు కూడా ప్రారంభించింది.
బుక్ చేసిన పది నిమిషాల్లోనే..
ఇప్పటికే గ్రాసరీ విభాగంలో సరికొత్త సంచలనాలను సృష్టిస్తున్న బ్లింక్ ఇట్.. ఇప్పుడు హాస్పిటల్ విభాగంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. బుక్ చేసిన పది నిమిషాల్లోనే అంబులెన్స్ అందిస్తామని సంచలన ప్రకటన చేసింది. క్విక్ కామర్స్ విభాగంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్న ఈ సంస్థ.. బుక్ చేసిన పది నిమిషాల్లోనే అంబులెన్స్ కూడా పంపిస్తామని చెబుతోంది. ఈ సర్వీస్ ను గురు గ్రామ్ లో అందుబాటులోకి తెచ్చింది.. ఈ అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు.. జిపిఎస్ మానిటర్.. పారామెడికల్ సహాయకుడు.. లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. అయితే దీనికోసం ఎంత ఛార్జ్ చేస్తారనే విషయాన్ని బ్లింక్ ఇట్ స్పష్టం చేసింది. దూరం ఆధారంగానే.. అందించిన సర్వీస్ ఆధారంగానే డబ్బులు వసూలు చేస్తామని ప్రకటించింది. సకాలంలో అంబులెన్స్ లు అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని.. హాస్పిటల్ వద్ద ఉన్న అంబులెన్సులు రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయని.. అందువల్లే రోగులకు ఉపయుక్తంగా ఉండేందుకు.. ఫోన్ చేసిన పది నిమిషాల్లోనే అందుబాటులో ఉండేందుకు ఈ సర్వీసులు ప్రారంభించామని బ్లింక్ ఇట్ సీఈఓ అల్బిందర్ వెల్లడించారు. ఈ విభాగంలో ఇంతవరకు ఈ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టలేదని.. ఇందులో ఉన్న అవకాశాల ఆధారంగానే తాము ఈ వినూత్న ఆలోచనకు తెర తీశామని అల్విందర్ పేర్కొన్నారు.