https://oktelugu.com/

Chanakyaniti : చాణక్య నీతి: మీరు మనీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారా? కానీ దాన్ని మించినవి ఇవి.

ధనం, ధర్మంలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే ధర్మాన్ని ఎంచుకునే వారు ఉత్తమమైన వారు అంటారు ఆచార్య చాణక్యుడు. ధర్మం లేని వ్యక్తి గుడ్డివాడితో సమానంగా భావించారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 5, 2025 / 08:31 PM IST
    Follow us on

    Chanakyaniti : చాణక్య నీతిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఎన్నో విషయాలను ఆయన వివరించారు. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం కనుక్కోవడానికి మీకు చాణక్య నీతి ఉపయోగపడుతుంది. పిల్లల నుంచి పెళ్లి వరకు ప్రేమ నుంచి భార్యభర్తల విడాకుల వరకు ప్రతి విషయాన్ని గురించి ఆయన వివరించారు. చాలా సలహాలు, సూచనలు కూడా చేశారు చాణక్యుడు. అయితే చాలా మంది మనీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ మనీకి మించి చాలా విషయాలు కూడా విలువైనవి ఉన్నాయి. ఈ విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోరు.

    డబ్బు వెనక పరిగెడుతూ జీవితాన్ని చాలా కష్టతరంగా మార్చుకుంటున్నారు ప్రజలు. డబ్బును అవసరానికి మాత్రమే కాకుండా కొన్ని తరాలు కూడా కూర్చొని తినేలా సంపాదిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఏకంగా emi ల కోసం సంపాదిస్తూ జీవితంలో సంతోషాన్ని లేకుండా గడిపేస్తున్నారు. ప్రతి వస్తువు కొనుగోలు చేసి వాటికి emi లు కట్టడానికే సంపాదిస్తున్నారు. అయితే మనీ కంటే కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటి అంటే?

    ఎలాంటి సమస్యకు అయినా సరే చాణక్యుడు ఒక పరిష్కారం చెప్పారు. తన నీతులలో పరిష్కారం చూపించే గొప్ప వ్యక్తి చాణక్యుడు. ఆయన చెప్పిన నీతులు నేటికీ సందర్భోచితంగా మనకు చాలా మందికి ఉపయోగపడతాయి. మరి ఆయన ధనం కంటే ముఖ్యమైనది ఏమిటి అనే విషయాల గురించి ఏం చెప్పారంటే? ఆచార్య చాణక్యుడు తన నీతిలో ధనం పట్ల అహంకారం చూపించవద్దు అన్నారు. జీవితంలో ధనం కంటే ముఖ్యమైనవి మరిన్ని ఉన్నాయని వాటి పట్ల కాస్త జాగ్రత్త పడాలని సూచించారు.

    అన్నింటి కంటే ప్రపంచంలో ధర్మం అతి ముఖ్యమైనది. ఇక ఆచార్య చాణక్యుని ప్రకారం ధనం కంటే ధర్మం చాలా ముఖ్యమైనది అంటారు. ధనం, ధర్మంలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే ధర్మాన్ని ఎంచుకునే వారు ఉత్తమమైన వారు అంటారు ఆచార్య చాణక్యుడు. ధర్మం లేని వ్యక్తి గుడ్డివాడితో సమానంగా భావించారు.

    ధనం కంటే ఆత్మగౌరవం కూడా చాలా ముఖ్యమైనది. జీవితంలో అతి ముఖ్యమైనది ఆత్మగౌరవంగా చెబుతారు చాణక్యుడు. ఆత్మగౌరవం విషయానికి వస్తే ధనం గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. పోయిన ధనాన్ని తిరిగి పొందవచ్చు. కానీ ఆత్మగౌరవం పోతే సంపాదించలేము అన్నారు.

    సంబంధాలను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలోధనం గురించి ఆలోచించకూడదు. ధనం లేకపోయినా జీవించవచ్చు. కానీ కుటుంబం, బంధువులు లేకుండా జీవితం చాలా కష్టం. కానీ చాలా మంది డబ్బు ఉంటే అందరూ ఉంటారు అనుకుంటారు. కానీ ఈ రెండింటిలో ముఖ్యంగా బంధాలకే విలువ ఇవ్వాలి అంటారు చాణక్యుడు. .