speak English : చాలా మందికి ఇంగ్లీష్ మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి అది సాధ్యం కాకపోవచ్చు. బాల్యం నుంచి ఇంగ్లీష్ మీడియంలో చేరిన పిల్లలు, లేదా ఇంగ్లీష్ క్లాస్ లకు వెళ్లిన పిల్లలు, ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడే పేరెంట్స్ ఉన్న పిల్లలకు ఈ సమస్య పెద్దగా ఉండదు. కానీ లేని వారికి మాత్రం ఇంగ్లీష్ తో కాస్త సమస్యనే అని చెప్పాలి. ఇక కొందరికి ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం కూడా పెద్ద సమస్యగానే ఉంటుంది. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం మీరు ఇంగ్లీష్ ను అనర్గళంగా మాట్లాడవచ్చు. కాదు కాదు ఏకంగా ఓ టీవీ యాంకర్ లాగా మాట్లాడవచ్చు. ఇంతకీ మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఏం చేయాలంటే?
టీవీ న్యూస్ యాంకర్ లాగా మాట్లాడాలంటే క్లారిటీ, కాన్ఫిడెన్స్ పై దృష్టి పెట్టాలి. మీరు మాట్లాడే టాపిక్ మీద మీకు క్లారిటీ ఉండాలి. మాట్లాడాలి అనే కాన్ఫిడెన్స్ ఉంటే కాస్త ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలి అంటే మొదట, మీరు చదవడం కంటే ఎవరితోనైనా మాట్లాడటం బెటర్. సహజంగా సంభాషణగా మాట్లాడండి. దీని వల్ల కాస్త సులభం అవుతుంది. మరీ ముఖ్యంగా స్పష్టమైన ప్రసంగం కోసం ముందుగా మీరు మాట్లాడే పదాలను పూర్తిగా ఉచ్చరించేలా చూసుకోండి. ఎవరితో మాట్లాడినా ఒకే కానీ మాట్లాడే పదాలు స్పష్టంగా పలకాలి.
మీ పదజాలాన్ని విస్తరించడం వల్ల కూడా మిమ్మల్ని మీరు మరింత సమర్థవంతంగా వ్యక్తీకరించడంలో సహాయపడుతుంది. అంటే ఎక్కువ పదజాలం మీ వద్ద ఉండాలి. ఎక్కువ ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాలి. మీ భాషను సరళంగా చేసుకోండి. మెరుగైన కమ్యూనికేషన్ కోసం అనవసరమైన సంక్లిష్టతను నివారించాలి. ఇక ఆంగ్లంలో చదవడం ద్వారా రెగ్యులర్ ప్రాక్టీస్ అవుతుంది. విశ్వాసాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇక ఆన్‌లైన్ చర్చలు లేదా సమూహ తరగతులలో పాల్గొనండి. వారితో మీరు కూడా మాట్లాడండి. దీని వల్ల మంచి సాధన అవుతుంది.
మాట్లాడటం, వినడం, వ్యాకరణం వంటి విభిన్న భాషా నైపుణ్యాలను అధ్యయనం చేయాలి. మీ ఉచ్చారణను మెరుగుపరచడానికి పదాలపై సరైన ప్రాధాన్యతను తెలుసుకోవడానికి వార్తా నివేదికలలో మీరు విన్న వాటిని అనుకరించండి. ఇక మీరు మాట్లాడుతే దాన్ని రికార్డ్ చేయండి. దాంట్లో మీరు ఎలాంటి మిస్టక్ లు చేస్తున్నారో అర్థం అవుతుంది. కొన్ని సార్లు ప్రొఫెసర్లతో మాట్లాడండి. ఇంగ్లీషులో వార్తల ప్రసారాలను వినడం వలన మీరు కొత్త పదాలు, పదబంధాలు, ఉచ్చారణలో మెరుగు అవుతారు.
మీరు వీలైనంత ఫ్రీగా మాట్లాడటానికి ట్రై చేయాలి. భయం విడిచిపెట్టి మాట్లాడటం ప్రాక్టీస్ చేయాలి. తప్పు మాట్లాడినా సరే మీ స్నేహితులు, సన్నిహితుల వద్ద ఇబ్బంది పడకుండా మాట్లాడాలి. ఎంత ఎక్కువగా మీరు మాట్లాడటానికి ప్రయత్నిస్తే అంత ఫాస్ట్ గా ఏ లాంగ్వేజ్ ను అయినా ఈజీగా నేర్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు.