Homeబిజినెస్Pradhan Mantri Jan-Dhan Yojana: జన్‌ధన్‌ ఖాతాదారులకు రూ.10 వేలు.. ఎలా పొందాలంటే?

Pradhan Mantri Jan-Dhan Yojana: జన్‌ధన్‌ ఖాతాదారులకు రూ.10 వేలు.. ఎలా పొందాలంటే?

Pradhan Mantri Jan-Dhan Yojana: ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన (Jan Dhan Yojana) పథకం మోదీ ప్రభుత్వం (Modi Govt) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలలో ఒకటి. ఈ పథకం అమలులోకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తైంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 43 కోట్ల 4 లక్షల ఖాతాలు తెరవబడ్డాయి. ఈ స్కీమ్ ద్వారా పేద, అణగారిన వర్గాలకు చెందిన కోట్ల మంది ప్రజలు సులభంగా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక చేయూత కార్యక్రమాలలో ఈ స్కీమ్ ఒకటని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ఈ స్కీమ్ కింద ఓపెన్ చేసిన ఖాతాల్లో డిపాజిట్ల మొత్తం లక్షా 46వేల కోట్లు కావడం గమనార్హం. ఈ స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు 10,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఖాతాదారుని ఖాతాలో బ్యాలెన్స్ లేని సమయంలో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని వినియోగించుకోవచ్చు. అయితే ఓవర్ డ్రాఫ్ట్ కింద పొందిన డబ్బులకు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి 5,000 రూపాయలు కాగా కేంద్రం తాజాగా పరిమితిని పెంచింది.

ఎవరైతే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కింద అప్పు తీసుకోవాలని అనుకుంటారో వాళ్లు జన్ ధన్ యోజన ఖాతాను కనీసం ఆరు నెలలు వినియోగించి ఉండాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న ఖాతాదారునికి మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కింద రుణం లభిస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ గరిష్ట వయోపరిమితిని కేంద్రం 65 సంవత్సరాలకు పెంచింది. పీఎంజేడీవై ఓవర్ డ్రాఫ్ట్ కింద 2,000 రూపాయల వరకు ఎటువంటి గ్యారంటీని ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు.

సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సాధారణంగా మహిళా సభ్యులకు ఈ స్కీమ్ ద్వారా సులభంగా లోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper