Mega Star Chiranjeevi’s GodFather: మెగా క్రేజీ రీమేక్ కి ‘గాడ్ ఫాదర్’ (Godfather)పై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతూనే ఉన్నాయి. అందుకే, ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాలో నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా విద్యాబాలన్ పేరు వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమా ‘గాడ్ ఫాదర్’ (God Father). ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ రాజాను ఫిక్స్ చేసిన తరువాత, ఆయన స్క్రిప్ట్ లో చాలా పాత్రలను యాడ్ చేశాడు. అలాగే చాలా మార్పులు చేసాడు. అయితే, మలయాళ వెర్షన్ లో ‘మంజు వార్యర్’ పాత్ర చాలా కీలకమైనదే. కాగా తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో బాలీవుడ్ నటి ‘విద్యా బాలన్’ నటించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
అయితే, ఈ పాత్ర పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. మొదట సుహాసిని నటిస్తోంది అన్నారు. ఆ తర్వాత అనసూయ నటిస్తోంది అన్నారు. ఇప్పుడు ఏకంగా విద్యాబాలన్ పేరు వినిపించడం నిజంగా విశేషమే. ఐతే ఒకవేళ విద్యాబాలన్ నటిస్తే, ఆమె ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. పైగా ఆమె నటిస్తే.. ఈ సినిమాకి బాలీవుడ్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది.
ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మోషన్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ తల పై క్యాప్ తో స్టైలిష్ లుక్ లో చేతిలో గన్ పట్టుకుని అలా ఫోజ్ ఇస్తే అభిమానులకు పూనకాలతో ఊగిపోయారు. అందుకే, ఈ సినిమా పై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతూనే ఉన్నాయి.
ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను స్టంట్ మాస్టర్ సిల్వ నేతృత్వంలో విలన్స్ పై షూట్ చేస్తున్నారు. ఫైట్స్ విషయంలో చిరు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. రిస్క్ ఫైట్స్ కూడా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మెగాస్టార్.
కాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తుండగా.. నిరవ్ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.