Homeజాతీయ వార్తలు30 years of grudge against CBI: సిబిఐ మీద 30 ఏళ్ల పగ.. ఈ...

30 years of grudge against CBI: సిబిఐ మీద 30 ఏళ్ల పగ.. ఈ రైల్వే మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే?

30 years of grudge against CBI: స్వతంత్ర దర్యాప్తు సంస్థగా పేరుపొందిన సిబిఐ.. ఇప్పటివరకు మనదేశంలో ఎన్నో కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఎన్నో అక్రమాల గుట్టు రట్టు చేసింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను జైలు పాలు చేసింది. అక్రమాలకు పాల్పడిన రాజకీయ నాయకులకు శ్రీకృష్ణుడి జన్మస్థానం దారి చూపించింది. ముఖ్యమంత్రిలు… మంత్రులు.. అధికారులు.. ఇలా ఎంతోమంది సిబిఐ చేతిలో విచారణ ఎదుర్కొన్నవారే. జైలు శిక్ష అనుభవించిన వారే. అయితే సిబిఐ కి సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. అది స్వతంత్రంగా దర్యాప్తు చేసే స్థాయిని ఎప్పుడో కోల్పోయిందని.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కబంధహస్తాల్లో చిక్కుకుపోయిందని.. అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఎన్ని ఆరోపణలున్నప్పటికీ సిబిఐ తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంది.

Also Read: Baba Ramdev : జుట్టు నల్లగా మారడానికి బాబా రామ్‌దేవ్ చెప్పిన నేచురల్ రెమెడీ..

సిబిఐ కి సంబంధించిన ఒక సంఘటన ఇప్పుడు దేశ రాజకీయాలలో సంచలనంగా మారింది. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం అవినీతి కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. నాడు రైల్వే శాఖలో ఉద్యోగ పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన దినేష్ ముర్ము ను సిబిఐ నిందితుడిగా ప్రకటించింది. అయితే అప్పటికి దినేష్ రైల్వే శాఖలో పనిచేస్తున్నాడు. రైల్వే శాఖలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారంలో దినేష్ కు కూడా పాత్ర ఉందని సిబిఐ నిర్ధారించింది. అయితే ఈ విషయాన్ని సవాల్ చేస్తూ దినేష్ కోర్టు దాకా వెళ్ళాడు. అయితే అతడికి వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. దీంతోపాటు ఉద్యోగం కూడా పోయింది. క్రమంలో తన ఉద్యోగం పోవడానికి.. కుటుంబం రోడ్డుమీదికి రావడానికి సిబిఐ కారణమని దినేష్ పగ పెంచుకున్నాడు. సిబిఐ అంటే చాలు ఒంటి కాలు మీద లేచేవాడు. సిబిఐ అధికారులపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన అతడు.. సూపర్ స్కెచ్ చేశాడు..

Also Read: Kerala Rains: కేరళలో భారీ వర్షాలు

బీహార్ నుంచి లక్నో వెళ్లిపోయిన దినేష్.. లక్నోలోని సిబిఐ కార్యాలయానికి చేరుకున్నాడు. తన వెంట విల్లు, బాణాలతో కార్యాలయానికి వెళ్ళాడు. ఆ కార్యాలయంలో ఉన్న ఒక ఏఎస్ఐ ని తీవ్రంగా గాయపరిచాడు. మిగతా అధికారులపై దాడి చేసేందుకు అతడు ప్రయత్నించగా.. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆ తర్వాత దినేష్ ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ” బంగారం లాంటి ఉద్యోగం సిబిఐ అధికారులు చేసిన అతి వల్ల పోయింది. ఇప్పుడు నేను ఉద్యోగం లేని వాడిగా మిగిలిపోయాను. కుటుంబ పోషణ కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాను. ఉద్యోగిగా పని చేయాల్సిన నేను.. ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను. దీనికి కారణం సిబిఐ అధికారులు. వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని” దినేష్ ఈ సందర్భంగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version