https://oktelugu.com/

Post Office MIS Scheme: ఒక్కసారి డిపాజిట్ చేస్తే నెలకు రూ.5,000.. ఎలా పొందాలంటే?

Post Office MIS Scheme: పోస్టాఫీసులు ప్రస్తుతం ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలా ఆదాయాన్ని పొందాలని భావించే వాళ్ల కోసం మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ ను పోస్టాఫీస్ అమలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్రం ఈ స్కీమ్ పై 6.8 శాతం వడ్డీరేటును అందిస్తోంది. ఒక్కసారి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది. కనీసం 1000 రూపాయలు ఈ స్కీమ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 15, 2021 / 12:51 PM IST
    Follow us on

    Post Office MIS Scheme: పోస్టాఫీసులు ప్రస్తుతం ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలా ఆదాయాన్ని పొందాలని భావించే వాళ్ల కోసం మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ ను పోస్టాఫీస్ అమలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్రం ఈ స్కీమ్ పై 6.8 శాతం వడ్డీరేటును అందిస్తోంది. ఒక్కసారి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది. కనీసం 1000 రూపాయలు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

    జాయింట్ అకౌంట్ ద్వారా భార్యాభర్తలు కూడా ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో 9 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు సంవత్సరానికి 59,400 రూపాయలు వడ్డీగా పొందుతారు. సింగిల్ అకౌంట్ కు 4,50,000 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండగా 29,600 రూపాయల వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు మారితే పొందే ఆదాయంలో స్వల్పంగా మార్పు ఉండే అవకాశం ఉంది.

    వడ్డీగా వచ్చే ఈ ఆదాయాన్ని ప్రతి నెలా పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ లో వేర్వేరు పేర్లతో వేర్వేరు స్కీమ్స్ అమలవుతుండగా ఈ స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం గురించి ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొన్ని సంవత్సరాలలోనే సులువుగా కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంటుంది. కరోనా వల్ల దేశంలో చాలామంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

    తక్కువ రిస్క్ తో రాబడి ఆశించే వాళ్లకు ఈ స్కీమ్ ఉత్తమమైన స్కీమ్ అని చెప్పవచ్చు. కరోనా వ్యాప్తి వల్ల చాలామందికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదని భావించే వాళ్లు వెంటనే ఈ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.