అంతేకాకుండా రిషికి ఇష్టమైన అభిరుచుల గురించి అడిగేసరికి రిషి పై ఆశలు పెట్టుకోవద్దు అంటూ జగతి కాస్త కోపంగా సమాధానమిస్తుంది. వసు తన మనసులో జగతి మేడం ఇన్ని జాగ్రత్తలు ఎందుకు చెబుతుందని అనుకుంటుంది. మరోవైపు ధరణి ఏడుస్తుండగా రిషి వచ్చి ఏం జరిగింది వదిన అని పలకరిస్తాడు. వెంటనే ధరణి ఏం జరగలేదంటూ చెప్పాగా రిషి ఇంట్లో వాళ్ళ బాధలు ఇంట్లో వాళ్లే తెలుసుకుంటారు అని మాట్లాడగా మా ఆయన గుర్తుకు వచ్చాడు అని సమాధానం ఇస్తుంది. కానీ రిషి మాత్రం అది కాదు ఏదో ఉంది అంటూ పెద్దమ్మ ని పిలుస్తా అంటూ అనేసరికి అదే సమయంలో అక్కడికి మహేంద్ర వస్తాడు. మహేంద్రకు కూడా సమాధానం ఇవ్వకపోవడంతో అర్థం చేసుకొని రిషిని అక్కడినుంచి తీసుకెళ్తాడు. ఇక మహేంద్ర ఈ రోజు ప్రాజెక్టు పని ఎలా జరిగింది అంటూ అనేసరికి మామూలుగానే అన్నట్లు సమాధానం చెబుతాడు. బాగా అద్భుతంగా సాగింది అన్నట్లు తెలిసింది అనేసరికి.. ఎవరు చెప్పారు అని ప్రశ్నిస్తాడు.
వసు శిరీష్ కి చెబుతున్న సమయంలో విన్నాను అంటూ అనేసరికి వసు ఈ విషయం గురించి అందరికీ చెబుతుందా అనుకుంటూ కోపంతో రగిలిపోతాడు. ఉదయాన్నే కాలేజీ దగ్గర వసు కోసం ఎదురు చూస్తాడు. వసు రాగానే బాగా కోపంగా మాట్లాడతాడు. శిరీష్ కి ఎందుకు చెప్పావు అంటూ రగిలిపోతాడు. ఇక వసు అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో జగతి మేడం చూసి వసుని పంపిస్తుంది. జగతి మేడమ్ కూడా అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో రిషి.. మేడమ్ అని పిలిచి వసు గురించి, శిరీష్ గురించి చెబుతూ ఫైర్ అవుతాడు. తరువాయి భాగంలో శిరీష్ వసుని కాలేజ్ సమయంలో బయటికి తీసుకెళ్లగా ఆ విషయం రిషికి తెలిసిపోతుంది. ఇక జగతి మేడమ్ తో మీ పర్మిషన్ లేనిది ఎక్కడికి వెళ్ళింది అంటూ ప్రశ్నించేసరికి.. వసు ఏంటి నన్ను ఇలా ఇరికించింది అని అనుకుంటుంది.