https://oktelugu.com/

వేసవిలో చల్లదనం కోసం ఫోర్టబుల్ ఏసీ, రిఫ్రిజిరేటర్.. ధర ఎంతో తెలుసా?

కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీలో అనేక మార్పులు వస్తున్నాయి. దీంతో కొత్త కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో కష్టంగా ఉపయోగించే వస్తువులు ఇప్పుడు సులభతరంగా వినియోగించే విధంగా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వేసవి కాలంలో బయటకు వెళ్లినప్పుడు చల్లగా ఉండడం కోసం ఏసీలు, రిప్రిజిరేటర్లు, ఫ్యాన్లు అవసరం. ఇవి ఇంట్లో మాత్రమే ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 21, 2024 / 09:34 AM IST

    Usb Aircooler

    Follow us on

    వేసవి కాలం వేడితో చంపేస్తుంది. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలు చల్లదనం కోసం ఆరాట పడుతున్నాయి. ఏసీలు, కూలర్లు లేనిది ఉండలేకపోతున్నారు. వేసవి కాలం కావడంతో కూలర్లు, ఏసీల ధరలు మండిపోతున్నాయి. పైగా ఇవి ఇంట్లో ఉన్నంత వరకు చల్లగా ఉంటారు. కానీ బయటకు వెళ్లాలంటే మాత్రం ఏసీలను, కూలర్లను తీసుకెళ్లడం సాధ్యం కాదు. కానీ ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లే ఏసీలు, ఫ్యాన్లు, రిప్రిజిరేటర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర కూడా తక్కువగా ఉండడంతో వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. అయితే ఇవి ఆన్ లైన్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవాలని ఉందా?

    కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీలో అనేక మార్పులు వస్తున్నాయి. దీంతో కొత్త కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో కష్టంగా ఉపయోగించే వస్తువులు ఇప్పుడు సులభతరంగా వినియోగించే విధంగా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వేసవి కాలంలో బయటకు వెళ్లినప్పుడు చల్లగా ఉండడం కోసం ఏసీలు, రిప్రిజిరేటర్లు, ఫ్యాన్లు అవసరం. ఇవి ఇంట్లో మాత్రమే ఉంటాయి. కానీ వీటిని ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.

    ఫోర్టబుల్ ఏసీ వ్యక్తిగతంగా చల్లదనాన్ని ఇస్తుంది. దీనిని ఎక్కడికంటే అక్కటికి తీసుకెళ్లొచ్చు. ఎండ వేడిలో పనిచేసేవారు. దీని ద్వారా ఒక్కసారిగా చల్లబడొచ్చు. దీని ధర రూ.799. ప్రస్తుతం ఇది ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. వాటర్ ట్యాంకును కలిగిన ఈ ఎయిర్ కూలర్ వినియోగదారులను ఆకర్షిస్తోంది.

    పోర్టబుల్ ఏసీ అవసరం లేని వారికి ఫోర్టబుల్ ఫ్యాన్ అందుబాటులో ఉంది. ఆది ఎయిర్ కూలర్ అంత చల్లగా ఉండకపోయినా ఫ్యాన్ వలె గాలి వస్తుంది. 10 బ్లేడ్లు కలిగిన ఇది యూఎస్ బీ ద్వారా పవర్ ను తీసుకోవచ్చు. దీనిని కూడా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. ఉక్కపోత తీవ్రంగా ఉంటే దీని ద్వారా చల్లబడొచ్చు.

    ఏసీలు, ఫ్యాన్లు మాత్రమే కాకుండా రిప్రిజిరేటర్ కూడా ఫోర్టబుల్ మోడల్ లో అందుబాటులోకి వచ్చింది. దీని కారులో వేసుకొని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. చల్లటి వస్తవులు ఇందులో వేసుకొని ఎంత దూరమైనా తీసుకెళ్లొచ్చు. ఇది కూడా యూఎస్ బీ ఆధారంగా పనిచేస్తుంది. దీనిని రూ.1,999 వద్ద విక్రయిస్తున్నారు.

    ఫ్యాన్ తో కూడిన సోలార్ క్యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీనిని రూ.600 వద్ద విక్రయయిస్తున్నారు. ఇందులో వైజర్, సోలార్ ఫ్యానెల్ పై ఫ్యాన్ అమర్చబడి ఉంటుంది. క్యాప్ తలకు ధరించడం వల్ల ఎండవేడిలో ఎక్కడికి వెళ్లినా తలకు గాలి వస్తుంది. దీనిని రూ.6.99 వద్ద విక్రయిస్తున్నారు.