Vijay Jana Nayagan : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ఎట్టకేలకు సెన్సార్ ఇక్కట్లను తొలగించుకొని ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి కేవలం తమిళనాడు లో మాత్రమే కాదు , తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి హైప్ ఉంది. ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక , అతని నుండి విడుదల అవ్వబోతున్న మొట్టమొదటి సినిమా కాబట్టి. సోషల్ మీడియా లో నిత్యం విజయ్ ట్రెండ్ అవుతూనే ఉన్నారు , జెన్ జీ ఆడియన్స్ ప్రస్తుతానికి ఆయనతో బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి. అందుకే ఈ సినిమాకు పోటీ వచ్చేందుకు ఎవ్వరూ సాహసం చేయడం లేదు , కానీ మన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం , ఎవరొస్తే నాకేంటి , నేను వస్తున్నా అనే నమ్మకం తో ఈ నెల 24 న ‘చెన్నై లవ్ స్టోరీ’ తో మన ముందుకు రాబోతున్నారు.
కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు మూవీ టీం. ఈ ప్రెస్ మీట్ లో విలేఖరులు ఇదే ప్రస్తావన తీసుకొని రాగా ‘నాకు సోలో గా సినిమాలు విడుదల చేసుకునే అదృష్టం లేదు లేండి. కానీ జన నాయగన్ వచ్చినా కూడా, మేము అదే తేదీన రాబోతున్నాము. మా సినిమా ఔట్పుట్ మీద బలమైన నమ్మకం ఉంది. చాలా అద్భుతంగా వచ్చింది. మన తెలుగు ఆడియన్స్ ముందుగా మన తెలుగు హీరోనే ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాను. ఎవరొచ్చినా మా సినిమా బాగా ఆడుతుంది అనే నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం. అయితే నైజాం ప్రాంతం లో మీ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు, ‘జన నాయగన్’ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు , వాళ్ళిద్దరికీ పడదు కదా , మీ సినిమాకు థియేటర్స్ దొరకడం కష్టం అవుతుందేమో అని కిరణ్ అబ్బవరం ని విలేఖరులు అడుగుతారు.
అందుకు కిరణ్ అబ్బవరం సమాధానం చెప్తూ ‘మా వెనుక SKN, సాయి రాజేష్ వంటి భారీ కటౌట్స్ ఉన్నారు , వాళ్ళు మాకు కావాల్సినన్ని థియేటర్స్ ఇస్తారు , అసలు సమస్యే లేదు. పైగా సాయి రాజేష్ గారితో దిల్ రాజు గారికి మంచి సాన్నిహిత్యం ఉంది , టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు’ అంటూ కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే , విజయ్ సీఎం అయితే నాకేంటి?, నేనైతే అదే తేదీన వస్తున్న అనే తరహా లో కిరణ్ అబ్బవరం మాస్ యాటిట్యూడ్ తో మాట్లాడారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి మన తెలుగు ఆడియన్స్ కిరణ్ అబ్బవరం నమ్మకాన్ని నిలబెడుతారో లేదో చూడాలి.
“Even if #JanaNayagan releases on July 24, we are coming on the same date.
We are very confident about #ChennaiLoveStory.” pic.twitter.com/t4dJhbbFrm
— Gulte (@GulteOfficial) July 15, 2026
