PMMVY Scheme: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వం మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రస్తుతం ఈ స్కీమ్ ద్వారా కేంద్రం తొలి కాన్పు సమయంలో మహిళలకు డబ్బులను అందిస్తోంది.
అయితే రెండో కాన్పుకు కూడా ఈ స్కీమ్ ను అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. అయితే మహిళందరూ ఈ స్కీమ్ కు అర్హులు కారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే మాత్రమే ఈ పథకంకు అర్హత పొందే ఛాన్స్ ఉంటుంది. ఏప్రిల్ నెల నుంచి ఈ నిబంధన అమలులోకి రానుందని సమాచారం అందుతోంది. ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన స్కీమ్ ను మరింత విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Also Read: ఉక్రెయిన్ -రష్యా వార్.. అభాసుపాలవుతున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
కేంద్ర ప్రభుత్వం గతంలో భర్త ఆధార్ కార్డును అందజేస్తే మాత్రమే మహిళల ఖాతాలో నగదు జమ చేసేది. ప్రస్తుతం మూడు విడతలలో కేంద్రం ఈ డబ్బును అందజేస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇకపై రెండు విడతల్లో ఈ నగదును జమ చేయనుందని తెలుస్తోంది. ఎక్స్‌పెండిచర్ ఫైనాన్స్ కమిటీ ప్రతిపాదనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లో మార్పులు చేసినట్టు బోగట్టా.
కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి 5 లక్షల కంటే ఎక్కువమంది మహిళలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందుతున్నారని సమాచారం అందుతోంది. సమీపంలోని ఆశా వర్కర్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: ఏపీ రాజధానిగా అమరావతి.. గుర్తిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Recommended Video: