Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్నే కలవరపాటుకు గురిచేస్తోంది. రష్యా దుందుడుకు చర్యలను ప్రపంచమే ఖండిస్తోంది. అన్ని దేశాలు హెచ్చరిస్తున్నా రష్యా మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. దీంతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జరుగుతున్న నష్టంపై బెంబేలెత్తిపోతోంది. అమెరికా సహా అన్ని దేశాలు కూడా రష్యా యుద్ధాన్ని విరమించాలని సూచిస్తున్నా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా సామ్రాజ్యవాదాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నా లక్ష్య పెట్టడం లేదు. కానీ రష్యా చర్యలతో ప్రపంచమే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ రష్యా వెనక్కి తగ్గాలని సూచించారు. ఆయన ఉక్రెయిన్లు అనే బదులు ఇరానియన్లు అని సంబోధించారు. దీంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు బైడెన్ మాటల్లోని ఆంతర్యమేమిటో ఎవరికి అర్థం కాలేదు. కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు నత్తి ఉన్న సంగతి చాలా మందికి తెలిసిందే.
Also Read: ఐఏఎస్ లలో వైరం రేపుతున్న రేవంత్ రెడ్డి?
ఇందులో భాగంగానే ఆయన మాటల్లో తడబడి ఉక్రెయిన్లు బదులు ఇరానియన్లు అని పలకడంతో అందరిలో అనుమానాలు వచ్చాయి. దీంతో బైడెన్ కు ఉన్న నత్తి గురించి తెలియడంతో వారు సర్దుకున్నారు. ఉక్రెయిన్లుకు బదులు ఇరానియన్లు అని పలకడం కాస్త వివాదానికి కారణమయ్యే అవకాశం ఏర్పడింది. కానీ అధికారులు సర్దిచెప్పి బైడెన్ కు ఉన్న బలహీనతను చెప్పడం విశేషం.
గతంలో కూడా ఆయన పలుమార్లు దొరికిపోయినట్లు తెలుస్తోంది. ఓసారి వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ అనే బదులు ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ అని సంబోధించి నాలుక కరుచుకున్నారు. ఇలా పలుమార్లు ఆయన నత్తితో వివాదాల్లోకి వెళ్లడం తెలిసిందే. ఆయనకు చిన్నప్పటి నుంచి ఉన్న నత్తితోనే ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఉన్న నత్తి ఇప్పటికి కూడా ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం అందరికి సుపరిచితమే
ఈ క్రమలో బైడెన్ మాటలతో విపరీతార్థాలు వచ్చి ఆందోళనకు గురైన సందర్భాలుండటంతో ఆయన ఏం మాట్లాడతారో ఎక్కడ తడబడతారోనని అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండి వాటిని సవరిస్తూ ఉంటుంది. దీంతో బైడెన్ కు ఉన్న నత్తితో ఆయనకు నిరంతరం కష్టాలే అని చెబుతున్నారు.
Also Read: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు అంత పెరుగుతాయా?