https://oktelugu.com/

వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 – 2022 ఆర్థిక సంవత్సరానికి నేడు బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ లో కేంద్రం వాహనదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర 90 రూపాయలు దాటగా కేంద్రం లీటర్ పెట్రోల్ పై 2.50 రూపాయలు, లీటర్ డీజిల్ పై 4 రూపాయలు అగ్రి ఇన్ ఫ్రా సెస్ ను విధించింది. నిర్మలా సీతారామన్ ప్రకటనతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 1, 2021 / 02:18 PM IST
    Follow us on

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 – 2022 ఆర్థిక సంవత్సరానికి నేడు బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ లో కేంద్రం వాహనదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర 90 రూపాయలు దాటగా కేంద్రం లీటర్ పెట్రోల్ పై 2.50 రూపాయలు, లీటర్ డీజిల్ పై 4 రూపాయలు అగ్రి ఇన్ ఫ్రా సెస్ ను విధించింది. నిర్మలా సీతారామన్ ప్రకటనతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని వాహనదారులు భావించారు. అయితే కేంద్రం సెస్ విధించినా పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులు ఉండవని తెలుస్తోంది. ఇతర ట్యాక్స్‌లు తగ్గించి కేంద్రం సెస్ విధించనుందని సమాచారం.

    మోదీ సర్కార్ 75 సంవత్సరాల వయస్సు పై బడిన సీనియర్ సిటిజన్లకు ఫైలింగ్ నుంచి మినహాయింపు కల్పించింది. పింఛన్, వడ్డీని బట్టి ఐటీ మినహాయింపులు ఉంటాయని తెలుస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ను మరో ఏడాది పాటు పొడిగించింది. 2022 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు ఇళ్ల కొనుగోలుపై రాయితీలను పొందవచ్చని తెలుస్తోంది. ఆదాయపు పన్ను శ్లాబులలో ఎటువంటి మార్పులు ఉండబోవని సమాచారం.

    కేంద్రం బంగారం, వెండిపై కూడా అగ్రి ఇన్ ఫ్రా సెస్ ను విధిస్తూ ఉండటం గమనార్హం. కేంద్రం యాపిల్ పై 35 శాతం, సొయాబిన్, పొద్దుతిరుగుడు ముడి నూనెపై 20 శాతం అగ్రి ఇన్ ఫ్రా సెస్ ను విధించడం గమనార్హం. మద్యం ఉత్పత్తులపై 100 శాతం, ముడి పామాయిల్ పై 17.5 శాతం అగ్రి ఇన్ ఫ్రా సెస్ ను కేంద్రం విధించనుంది. మరోవైపు బడ్జెట్ స్టాక్ మార్కెట్లలో జోష్ నింపింది. మధ్యాహ్నానికి సెన్సెక్స్ 1600 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 400 పాయింట్లు లాభపడటం గమనార్హం.

    కేంద్రం బడ్జెట్ లో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్ల రూపాయలుగా పేర్కొంది. కొత్తగా 100 సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కేంద్రం వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్ తీసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించడం గమనార్హం.