https://oktelugu.com/

బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు

మహమ్మారుల కారణంగా ఆరోగ్య బీమా ప్రాధాన్యాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజెప్పింది కేంద్రం. కరోనా మహమ్మారితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఆవశ్యకతను వివరించింది. ఈసారి బడ్జెట్‌లోనూ ఆ ప్రాముఖ్యతను చాటింది. ఓ రకంగా వైద్యఖర్చుల భారం నుంచి తప్పించి.. ఆర్థికంగా కుంగిపోకుండా చేసింది. మొత్తంగా చూస్తే భారత్‌లో బీమా రంగం ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేదు. ప్రజలకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన రాలేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో బీమా రంగం విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకొనే […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 1, 2021 / 02:28 PM IST
    Follow us on


    మహమ్మారుల కారణంగా ఆరోగ్య బీమా ప్రాధాన్యాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజెప్పింది కేంద్రం. కరోనా మహమ్మారితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఆవశ్యకతను వివరించింది. ఈసారి బడ్జెట్‌లోనూ ఆ ప్రాముఖ్యతను చాటింది. ఓ రకంగా వైద్యఖర్చుల భారం నుంచి తప్పించి.. ఆర్థికంగా కుంగిపోకుండా చేసింది. మొత్తంగా చూస్తే భారత్‌లో బీమా రంగం ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేదు. ప్రజలకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన రాలేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో బీమా రంగం విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

    ఇప్పటి ప్రభుత్వం బీమారంగంలోకి పెట్టుబడులను రప్పించే అంశంలో స్పష్టతతో ఉంది. 2019 బడ్జెట్‌ ప్రసంగంలోనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ.. ఆ తర్వాత బడ్జెట్‌లో మాత్రం ఈ ఊసే లేదు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎఫ్‌డీఐల అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలో 2021–-22 బడ్జెట్‌ బీమారంగంలో విదేశీ పెట్టుబడి విధానాలను సరళీకరిచనున్నారు. ఈ రంగంలో ఎఫ్‌డీఐలను 74శాతం పెంచనుంది. దేశీయ యాజమాన్యం ఉండాలన్న విధానం కూడా సరళీకరించవచ్చు. ఈ నిర్ణయాలు భారత్‌లో బీమారంగంలోకి సృజనాత్మక విధానాలను తీసుకొచ్చే అవకాశం ఉంది.

    Also Read: వ్యవసాయ చట్టాలు లాభమా..? నష్టమా..? అమెరికాలోని వ్యవసాయ చట్టాలు ఏం చెబుతున్నాయి..?

    గతేడాది ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో పలు శ్లాబుల్లో పన్ను శాతాన్ని తగ్గించింది. కాకపోతే వీటికి సెక్షన్‌ 80సీ వంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఈ సారి ప్రభుత్వం వీటికి కూడా ప్రకటించే అవకాశం ఉంది. జీవిత బీమా ప్రీమియంపై రూ.1.5 లక్షల వరకు మినహాయింపును ఇస్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎందుకంటే భారత్‌లో చాలా మంది పన్ను చెల్లింపుదారులు మినహాయింపులు లభిస్తాయనే ఉద్దేశంతో జీవిత బీమా తీసుకొంటున్నారు. దీంతోపాటు సెక్షన్‌ 80డీ కింద వైద్యబీమాకు ఇచ్చే మినహాయింపులు కూడా వర్తింపజేయాలి. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానానికి కూడా ప్రభుత్వం వీటిని అందిస్తే బీమా తీసుకోవడానికి ప్రజలను ప్రోత్సహించవచ్చు.

    Also Read: ట్రంప్‌పై అభిశంసన.. : రిపబ్లికన్ల ఫైర్
    ‌‌

    బీమా వ్యాపారంపై ప్రభుత్వం 12.5 శాతం పన్ను విధిస్తోంది. వాస్తవానికి ఈ పన్ను రేటు 1976లో 45 శాతం నుంచి 65 శాతం వరకు కార్పొరేట్‌ పన్ను విధించే రోజుల్లో అమల్లోకి తెచ్చింది. 2019లో కార్పొరేట్‌ పన్నును 22 శాతానికి (సెస్సు,సర్‌ఛార్జి మినహాయించి) తగ్గించింది. ఇక సరికొత్త తయారీ సంస్థలకు 15శాతంగా చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కార్పొరేట్‌ బీమా సంస్థలకు పన్ను మినహాయించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రంగంలో ఎఫ్‌డీఐలను పెంచడానికి ఇది సహకరిస్తుంది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

    బీమా సంస్థలు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి చాలాకాలం పడుతుంది. పలు కంపెనీలు 10 ఏళ్లు దాటినా ఇప్పటికీ నష్టాలను ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితికి ఇప్పుడు కరోనా మహమ్మారి తోడైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కనీసం 12 ఏళ్లపాటు నష్టాలను క్యారీ ఫార్వర్డు చేసే అవకాశం జీవిత బీమా కంపెనీలకు ఇవ్వాలి. జీవిత బీమాయేతర కంపెనీల విధానాల్లో మార్పులు తీసుకొని రావాలి. 43బీ కింద జీవిత బీమా కంపెనీలకు ఇచ్చే మినహాయింపులను జీవిత బీమాయేతర కంపెనీలకు వర్తింపజేయాలి. సాధారణంగా బీమా కంపెనీలకు ఆర్థిక రక్షణ కోసం కొన్ని కంపెనీలు ఇన్స్యూరెన్స్‌ చేస్తాయి. అలాంటి రీ ఇన్స్యూరర్ల కోసం చట్టాలను సరళతరం చేయాలి. భారత్‌లోని రీ ఇన్స్యూరెన్స్‌ చేసే విదేశీ కంపెనీలపై ప్రభుత్వం పన్ను పరిధిలోకి వస్తున్నాయి. వీటి విషయంపై నెలకొన్న గందరగోళాన్ని ఈ బడ్జెట్‌లో తొలగించి.. ప్రత్యేకమైన ట్యాక్స్‌కోడ్‌ను ప్రవేశపెడతారని భావిస్తున్నారు.