https://oktelugu.com/

స్టార్ హీరో నుండి “A” ట్రైలర్ !

“A” అనే టైటిల్ తో సినిమా వస్తోంది అనగానే అందరికీ ఆసక్తి కలిగింది. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా వస్తోన్న ఈ సినిమా పై అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోను భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. అందరి అంచనాలకు ధీటుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫిబ్రవరి 26న అత్యధిక థియేటర్స్ లలో వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ చిత్రాన్ని పివి ఆర్ సంస్థ గ్రాండ్ గా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 1, 2021 / 02:13 PM IST
    Follow us on


    “A” అనే టైటిల్ తో సినిమా వస్తోంది అనగానే అందరికీ ఆసక్తి కలిగింది. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా వస్తోన్న ఈ సినిమా పై అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోను భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. అందరి అంచనాలకు ధీటుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫిబ్రవరి 26న అత్యధిక థియేటర్స్ లలో వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ చిత్రాన్ని పివి ఆర్ సంస్థ గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది.

    Also Read: రజనీకాంత్ కోసం ఇరవై కిలోలు తగ్గిందట !

    అందులో భాగంగా చిత్ర యూనిట్ పబ్లిసిటీ ప్రమోషన్స్ ని విభిన్నంగా జరుపుతున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫిబ్రవరి 5న విడుదల చేయబోతున్నారు.. విజయ్ సేతుపతి A ట్రైలర్ రిలీజ్ చేయడంపై చిత్ర యూనిట్ లో నూతనోత్సాహం నెలకొనివుంది. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన థ్రిల్లర్ చిత్రం “A”.

    Also Read: ప్రభాస్ తో శ్రుతి హాసన్ రొమాన్స్ !

    కాగా యువ ప్రతిభాశాలి విజయ్ కురాకుల అద్భుతమైన స్వరాలను సమకూర్చారు.. ఇప్పటికే విడుదలైన పాటకు శ్రోతలనుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా ప్రవీణ్ కె బంగారి మంచి విజివల్స్ అందించాడట. సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు వర్క్ ఆకట్టుకునేలా ఉంటుందట. ఇక ఈ సినిమాకి సంగీతం విజయ్ కురాకుల. నిర్మాత గీతా మిన్సాల ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్