PAN Card Update:ప్రస్తుతం దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు పాన్ కార్డును వినియోగిస్తున్నారు. అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్‌తో వచ్చే పాన్ కార్డు వ్యక్తి లేదా కంపెనీల పన్ను బాధ్యతలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తుంది. ఒక వ్యక్తి పన్ను ఎగవేసినా అతని సంపాదన, ఖర్చులను బట్టి సులభంగా వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: ఫ్రిజ్ లో ఈ ఎనిమిది పదార్థాలను ఉంచితే చాలా ప్రమాదం.. అవేంటంటే?
చాలా సందర్బాలలో పాన్ కార్డును గుర్తింపు కార్డుగా వినియోగించడం జరుగుతుంది. అయితే పెళ్లి తర్వాత కొంతమంది యువతులు తమ పేరును మార్చుకుంటూ ఉంటారు. పేరు మార్చుకున్న యువతులు, పేరులో తప్పులు ఉన్నవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పేరు మార్చుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాన్ కార్డులో పేరు మార్చుకోవాలనుకుంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ వెబ్ సైట్ ను మొదట క్లిక్ చేయాలి.
ఆ తర్వాత వెబ్ సైట్ లో ‘పాన్‌లో కరెక్షన్’ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత వర్గం రకాన్ని ఎంపిక చేసుకుని సరైన పేరు , సరైన స్పెల్లింగ్‌తో డాక్యుమెంట్‌లను అప్ లోడ్ చేయడం ద్వారా పాన్ కార్డులోని పేరును సులభంగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాన్ కార్డ్ హోల్డర్లు ఇందుకోసం 110 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్ కు దరఖాస్తును పంపాలి.
దరఖాస్తు చేసిన రోజు నుంచి 45 రోజుల్లోగా పాన్ కార్డును పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా సులువుగా పెళ్లైన వారు పాన్ కార్డులో వివరాలను మార్చుకునే ఛాన్స్ ఉంటుంది.
Also Read: ఎయిర్ టెల్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ల పెంపు?