https://oktelugu.com/

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారుడు మరణిస్తే డబ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

LIC Policy Claim: రోజురోజుకు ఎల్‌ఐసీ పాలసీలను తీసుకునే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ఎక్కువమంది ఎల్‌ఐసీ పాలసీలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయే ఇన్సూరెన్స్ డబ్బులను ఎవరు క్లెయిమ్ చేసుకోవాలనే విషయంలో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్‌ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. పాలసీదారుడు ఎవరి పేరును నామినీగా ప్రస్తావించి ఉంటారో వాళ్లు మాత్రమే ఎల్‌ఐసీ పాలసీ డబ్బులను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 21, 2021 / 07:30 PM IST
    Follow us on

    LIC Policy Claim: రోజురోజుకు ఎల్‌ఐసీ పాలసీలను తీసుకునే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ఎక్కువమంది ఎల్‌ఐసీ పాలసీలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయే ఇన్సూరెన్స్ డబ్బులను ఎవరు క్లెయిమ్ చేసుకోవాలనే విషయంలో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్‌ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది.

    పాలసీదారుడు ఎవరి పేరును నామినీగా ప్రస్తావించి ఉంటారో వాళ్లు మాత్రమే ఎల్‌ఐసీ పాలసీ డబ్బులను పొందడానికి అర్హత కలిగి ఉంటారు. ఆఫ్ లైన్ ద్వారా ఎల్‌ఐసీ క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఐసీ పాలసీ కట్టిన హోమ్‌ బ్రాంచ్‌ ద్వారా పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. పాలసీ తీసుకున్న పాల‌సీదారు ఏజెంట్ లేదా ఆ ఏరియా డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్‌తో సంత‌కం తీసుకుని ఎల్‌ఐసీ పాలసీని సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.

    నామినీ మొదట ఎల్‌ఐసీ హోమ్‌ బ్రాంచ్‌కు వెళ్లి బ్రాంచ్ మేనేజర్ కు పాలసీదారుడు చనిపోయిన విషయాన్ని వెల్లడించాలి. ఆ తర్వాత ఫామ్‌ 3783, ఫామ్ 3801, నెఫ్ట్ ఫామ్‌ల‌ను నింపాలి. ఆ తర్వాత పాలసీదారుని పాలసీదారుని ఒరిజిన‌ల్ డెత్ స‌ర్టిఫికెట్‌, ఒరిజిన‌ల్ పాల‌సీ బాండ్, నామినీ పాన్ కార్డు జిరాక్స్, నామినీ ఆధార్ కార్డు లేదా ఓట‌ర్ ఐడీ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ లపై నామినీ సంతకం పెట్టి సబ్మిట్ చేయాలి.

    ఆ తర్వాత నామినీ ఇంటిమేషన్ లెటర్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీ సిబ్బంది పాలసీదారుడి గుర్తింపుకార్డులను, నామినీ గుర్తింపు కార్డులను చెక్ చేసి అప్లికేషన్ ను ఆన్ లైన్ లో సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత నామినీ ఖాతాలోకి నగదును జమ చేస్తారు.