ఆవు పేడతో తయారైన పెయింట్.. ఈ పెయింట్ వల్ల కలిగే లాభాలివే..?

సాధారణంగా ఆవు పేడను ఇంటి ముందు అలుకుతారనే సంగతి తెలిసిందే. ఇంటి ముందు అలికే పేడ వల్ల సూక్ష్మ క్రిములు చనిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. క్రిమి సంహారక గుణాలు పుష్కలంగా ఉన్న ఆవు పేడ వ్యవసాయానికి ఎరువుగా సైతం ఉపయోగపడుతుంది. ఆవు పేడను స్టిక్స్ లా చేసుకుని విక్రయించినా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఆవు పేడతో తయారైన పెయింట్ త్వరలో అందుబాటులోకి రానుంది. Also Read: డేటింగ్ యాప్స్ ను వాడుతున్నారా.. తస్మాత్ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 19, 2020 11:29 am
Follow us on


సాధారణంగా ఆవు పేడను ఇంటి ముందు అలుకుతారనే సంగతి తెలిసిందే. ఇంటి ముందు అలికే పేడ వల్ల సూక్ష్మ క్రిములు చనిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. క్రిమి సంహారక గుణాలు పుష్కలంగా ఉన్న ఆవు పేడ వ్యవసాయానికి ఎరువుగా సైతం ఉపయోగపడుతుంది. ఆవు పేడను స్టిక్స్ లా చేసుకుని విక్రయించినా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఆవు పేడతో తయారైన పెయింట్ త్వరలో అందుబాటులోకి రానుంది.

Also Read: డేటింగ్ యాప్స్ ను వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.?

సాధారణంగా ఆవు పేడతో పెయింట్ అని సాధారణ కెంపెనీలు చెబితే ఏదో మార్కెటింగ్ టెక్నిక్ అని అభిప్రాయపడతాం. కానీ స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో ఆవు పేడతో పెయింట్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాంటూ ఆ పెయింట్ కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. వేదిక్ పేరుతో తయారు చేసిన ఈ పెయింట్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: గ్యాస్ కుకింగ్ తో పిల్లలకు ఆ సమస్యలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక..?

ఆవు పేడతో తయారైన ఈ పెయింట్ ను కుమారప్ప నేషనల్ హ్యాండ్‌మేడ్ పేపర్ ఇన్‌స్టిట్యూట్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. యాంటీ వైరల్, బ్యాక్టీరియల్, విష రహిత లక్షణాలను ఈ పెయింట్ కలిగి ఉంటుందని.. సాధారణ పెయింట్ లతో పోలిస్తే ఈ పెయింట్ ఎక్కువ కాలం మన్నిక ఇవ్వడంతో పాటు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఎమల్షన్, డిస్టెంబర్ రూపాల్లో ఈ పెయింట్ అందుబాటులోకి వస్తుందని సమాచారం.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఈ పెయింట్ వల్ల ఆవు పేడకు డిమాండ్ పెరిగి రైతులకు సైతం ఆదాయం లభించనుంది. నితిన్ గడ్కరీ ఈ పెయింట్ వల్ల ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడతాయని.. రైతుల ఆదాయం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అతి త్వరలో ప్రజలకు మార్కెట్ లో ఈ పెయింట్ అందుబాటులోకి రానుంది.