కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రజలు వైరస్ బారిన పడకుండా మాస్క్ లను ధరిస్తున్నారు. అయితే ప్రజలు మాస్క్ ధరిస్తున్నప్పటికీ చేస్తున్న చిన్నచిన్న తప్పులు వాళ్లు వైరస్ బారిన పడటానికి కారణమవుతున్నాయి. మాస్కులు ధరించడం ద్వారా వైరస్ సోకకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. శాస్త్రవేత్తలు, వైద్యులు ప్రజలు మూడు లేయర్ల మాస్క్ లను వినియోగిస్తే మంచిదని చెబుతున్నారు.
Also Read: కరోనా వైరస్ ఉన్నంత కాలం మనవాళి ప్రమాదంలో ఉన్నట్లేనా?
వైద్యులు మాత్రం క్లాత్ తో తయారు చేసిన మాస్కులు వాడినా వైరస్ బారిన పడమని తెలుపుతున్నారు. అయితే చాలామంది ఒకసారి వాడిన మాస్క్ ను శుభ్రం చేసుకోకుండా మళ్లీ వినియోగిస్తున్నారు. కొన్ని మాస్కులను ఒకసారి వినియోగించిన తరువాత మళ్లీ వాడకూడదు. కానీ కొందరు మాత్రం వాటికి మళ్లీమళ్లీ వాడుతున్నారు. . మస్సాచుసెట్స్ లోవెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మాస్కుల వినియోగం గురించి పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Also Read: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. వారికి మరింత ముప్పు..?
ఒకసారి వాడిన మాస్క్ ను ఎదుటి వ్యక్తి దగ్గినా, తుమ్మినా మొదటిసారి మాత్రమే బాగా ఫిల్టర్ చేస్తాయని.. పదేపదే మాస్కులను వినియోగించడం వల్ల సూక్ష్మ క్రిములు శరీరంలోకి చొచ్చుకుపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాస్క్ ను పదేపదే వినియోగిస్తే హానికారక క్రిములు సైతం శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకసారి వాడిన మాస్క్ ను మరోసారి వాడకపోవడమే ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
ప్రజల్లో చాలామంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడుతున్నామని చెబుతున్నారని.. వాళ్లు చేసే చిన్నచిన్న తప్పులే వైరస్ బారిన పడటానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. మాస్క్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వైరస్ సోకే అవకాశం ఉందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.