Orient Technologies : ఓరియంట్ టెక్నాలజీస్ ఐపీవో..: లాభాలు కావాలంటే ఇలా చేయాల్సిందే..!

ఓరియంట్ టెక్నాలజీస్ ఐపీవోకు సిద్ధం అవుతుంది. ఈ నెల 21 నుంచి ఐపీవో కు వెళ్లనుంది. మూలధనం సేకరించి వ్యాపారం విస్తరించే ప్రక్రియలో భాగంగా ఐపీవోకు వెళ్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

Written By: Srinivas, Updated On : August 20, 2024 3:21 pm

Orient Technologies IPO

Follow us on

Orient Technologies : ప్రముఖ కంపెనీ ఓరియంట్ టెక్నాలజీస్ ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నది. అయితే తన వ్యాపార విస్తరణలో భాగంగా నిధులు సేకరించేందుకు ఐపీవో కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కొనసాగిన ఈ కంపెనీలో ఇక షేర్లు కొనేవారు కూడా వాటాదారులుగా మారనున్నారు. మార్కెట్ లో ప్రతీ కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించాలనుకోవడం సర్వసాధారణం. రానున్న రోజుల్లో మరింత ఎదుగుదల అవసరమనే కోణం ప్రతి కంపెనీ యాజమాన్యానికి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. ప్రజలకు దగ్గర కావడం, ఉత్పత్తిని పెంచడం, లాభాల అర్జన ఇందులో ప్రధాన ఉద్దేశాలు. అయితే ప్రజల నుంచి షేర్ల రూపంలో కొంత మూలధనం సేకరించే అవకాశం అన్ని కంపెనీలకు ఉంటుంది. ఇక ఓరియంట్ కూడా ప్రస్తుతం ఈ మూలధనం సేకరించే పనిలో పడింది. ఐపీవో ద్వారా ప్రజలకు షేర్లు విక్రయించనుంది. ప్రైవేట్ యాజమాన్యం కింద నడుస్తున్న ఈ కంపెనీలో ఇక మదుపర్లు కూడా షేర్ హోల్డర్స్ కానున్నారు. ఆగస్టు 21న ఈ కంపెనీ ఐపీవోకు రానుంది. ఈ వివరాలు ఏంటో తెలుసుకుందాం.. ఓరియంట్ టెక్నాలజీస్ కంపెనీ ఐపీవోలో ఆగస్టు 21 నుంచి ఉంటుంది. 23 వరకు కొనసాగుతుంది. షేర్ ధర రూ. 195 నుంచి రూ. 206 గా కంపెనీ యాజామాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ఐపీవోలో సుమారు రూ. 215 కోట్ల మూలధనం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరైనా ఈ షేర్లన కొనుగోలు చేయొచ్చు. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 72 షేర్లు( సింగిల్ లాట్) కు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఇందులో ఉంది. ప్రస్తుతం ఐపీవోలో ఈ సంస్థ రూ. 120 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేస్తుంది. ఇందులో ఆఫర్ సేల్ కింద రూ. 90లక్షలకు పైగా విలువైన 46 లక్షల ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయి. ఇందులో కేటగిరీల వారీగా కేటాయింపులు ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

పెట్టుబడుల ద్వారా..
ఐపీవోలో సేకరించే మూలధనాన్ని ఏం చేస్తారనే విషయాన్ని కూడా సంస్థ ప్రకటించింది. ఇందులో రూ. 79.65 కోట్లను మూలధన వ్యయానికి, రూ. 10.35 కోట్లను ముంబైల్ని కార్యాలయం, మిగతా సాధారణ అవసరాలకు వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది.. అయితే ఓరియంట్ టెక్నాలజీస్ సంస్థ ప్రస్తుతం పెద్ద ఎత్తున లాభాల్లో నడుస్తున్నది. 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో రూ. 6వందల కోట్లకుపై సాధించింది. ఇందులో రూ. 41.45 కోట్ల నికర లాభం ఉంది. ఇక ఐటీ, క్లౌడ్, డేటా మేనేజ్ మెంట్ లలో ఈ సంస్థ సేవలు అందిస్తున్నది.

ప్రముఖ కంపెనీలు ఇవే..
ప్రభుత్వ , ప్రైవేట్ రంగాల్లోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ , హెల్త్ కేర్, ఫార్మా తదితర రంగాల్లో ఈ సంస్థకు వినియోగదారులు ఉన్నారు. ముఖ్యంగా కోలిండియా, జ్యోతి ల్యాబ్స్, బ్లూచిప్, ట్రేడ్ బుల్స్, ఏసీజీ, ఇంటెగ్రాన్ , తదిరత కంపెనీలు వీరికి క్లయింట్లుగా ఉన్నాయి. ఇక విస్తృతస్థాయి సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతం ఈ సంస్థకు పుణె, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో బ్రాంచ్ లు ఉన్నాయి.

ఇక సంస్థ పురోగతిలో భాగంగా మరింత విస్తరించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సంస్థను ఐపీవోకు తీసుకెళ్తున్నారు. ప్రజలను వాటాదారులుగా చేసి వచ్చే మూల ధనంతో వ్యాపారాభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. ఆగస్టు 21 నుంచి సంస్థ ఐపీవో కొనసాగనుంది.