Homeబిజినెస్Oppo Reno 16 Launch 2026: Oppo నుంచి రెండు కొత్త మొబైల్స్.. ఇవి ఎవరికి...

Oppo Reno 16 Launch 2026: Oppo నుంచి రెండు కొత్త మొబైల్స్.. ఇవి ఎవరికి ఉపయోగమో తెలుసా..

Oppo Reno 16 Launch 2026: Oppo కంపెనీ వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ కంపెనీ నుంచి Reno 16, Reno 16 Pro మోడల్స్ త్వరలో లాంచ్ కానున్నాయి. అయితే ఇప్పటికే లీక్‌ల ద్వారా వాటి స్పెస్ వివరాలు బయటపడ్డాయి. ఈ సిరీస్ జూన్ 2026లో చైనాలో మొదట విడుదలై, భారత్‌లో ఆ తర్వాత వస్తుందని అంచనా. అయితే ఈ ఫోన్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం..

డిస్ప్లే :
Reno 16 Proలో 6.78 అంగుళాల 1.5K LTPO OLED డిస్ప్లే ఉంటుంది. ఇది సన్నని బెజెల్స్‌తో ప్రీమియం లుక్ ను అందిస్తుంది. Reno 16లో 6.67 అంగుళాల డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ రెండూ మొబైల్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ వ్యూయింగ్ అందిస్తాయి. దీంతో మూవీస్ ఎక్కువగా మొబైల్స్ లో చూసేవారికి ఈ డిస్ ప్లే ఆకట్టుకోనుంది. అలాగే ఇవి HDR10+ మద్దతు, 4500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఉండడంతో గేమింగ్ కోరుకునేవారికి కూడా ఉపయోగపడుతాయి.

ప్రాసెసర్ & పెర్ఫార్మెన్స్:
Reno 16 Proలో MediaTek Dimensity 9500s లేదా Dimensity 9400+ చిప్‌సెట్ ఉంటుంది. Reno 16లో Dimensity 8500 ఉండవచ్చు. 12GB RAM, 256GB స్టోరేజ్ నుంచి 16GB+1TB వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ కెపాసిటీ మల్టీటాస్కింగ్‌కు బలోపేతం చేస్తుంది.

కెమెరా:
రెండు మోడల్స్ లోనూ ఒకే రకమైన కెమెరా ఉండుంది. 200MP ప్రైమరీ సెన్సార్, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ ఉంటాయి. ఫ్రంట్ లేదా సెల్పీ కెమెరా 50M, AI ఎన్‌హాన్స్‌మెంట్స్‌తో ఫోటోగ్రఫీలో టాప్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.

బ్యాటరీ & చార్జింగ్:
Reno 16 Proలో 7000mAh భారీ బ్యాటరీ ఉండనుంది. ఇది 100W ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. Reno 16లో 6500-7000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది రోజంతా వినియోగించేవారికి బాగా సరిపోతాయి. వైర్‌లెస్ చార్జింగ్ కూడా ఉండవచ్చు.

ధర:
భారత్‌లో 8GB/256GB బేస్ వేరియంట్ Reno 16 ధర రూ.45,000 నుంచి రూ.50,000 ఉంటుందని అంటున్నారు. Reno 16 Pro రూ. 55,000నుంచి రూ.70,000 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వైట్, బ్లాక్, పర్పుల్, గ్రీన్ కలర్లలో ఈ మొబైల్స్ అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఒప్పో మొబైల్స్ లో చాలా వరకు ఆదరణ పొందాయి. ఇవి కూడా ఆకట్టుకుంటాయని కంపెనీ ప్రతినిధులు నమ్ముతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular