Oppo Reno 14 5G : కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే కెమెరాలు, పవర్‌ఫుల్ బ్యాటరీ, మంచి పర్ఫామెన్స్ కావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒప్పో కంపెనీ రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చింది. అవే ఒప్పో రెనో 14 5G, ఒప్పో రెనో 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్స్. ఈ ఫోన్లు మార్కెట్లోకి రాగానే వివో, షియోమి లాంటి పెద్ద కంపెనీలకు కూడా టెన్షన్ పెరిగింది. మరి ఈ ఫోన్ల ధర ఎంత? వాటిలో ఏమేం కొత్త ఫీచర్లు ఉన్నాయి? వివరంగా తెలుసుకుందాం.
ఒప్పో రెనో 14 5G ధర విషయానికి వస్తే 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999గా నిర్ణయించారు. ఒప్పో రెనో 14 ప్రో 5G ధరల విషయానికి వస్తే.. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54,999గా నిర్ణయించారు. ఈ ఒప్పో రెనో 14 సిరీస్ ఫోన్‌ల అమ్మకాలు జులై 8 నుంచి మొదలవుతాయి. వీటిని ఒప్పో కంపెనీ వెబ్‌సైట్‌లో, అమెజాన్‌లో, అలాగే సెలక్ట్ చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ ని నాశనం చేస్తున్నది ఎవ్వరు… హీరోలా? ప్రొడ్యూసర్ల..?
ఒప్పో రెనో 14 ప్రో 5G ఫీచర్లు
ఈ ప్రో మోడల్ చాలా పవర్‌ఫుల్ ఫీచర్స్‌తో వస్తుంది. ఇందులో 6.83 అంగుళాల 1.5K రెజల్యూషన్ ఉన్న ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. దీనికి 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉన్నాయి. అంటే తెర చాలా స్పష్టంగా, బ్రైట్‌గా ఉంటుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంది. ఇది ఫోన్ చాలా వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ ఫోనులో కెమెరానే హైలెట్. వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి.. అన్నీ కూడా 50 మెగాపిక్సెల్స్ . 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం కూడా 50MP సెన్సార్ ఉంది. అంటే, మొత్తం నాలుగు 50MPకెమెరాలు ఉన్నాయి. ఇందులో 6200 mAh కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీ ఉంది. దీనికి 80W సూపర్‌వూక్, 50W ఎయిర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అంటే ఫోన్ చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది.
ఒప్పో రెనో 14 5G ఫీచర్లు
ఈ మోడల్ కూడా మంచి ఫీచర్లతో వస్తుంది. ఇందులో 6.59 అంగుళాల 1.5K రెజల్యూషన్ ఉన్న ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ వాడారు. వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 50MP సెన్సార్ ఉంది. 6000 mAh కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంది. దీనికి 80W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
మార్కెట్‌లో ఒప్పో రెనో 14 సిరీస్ ఫోన్‌లు మార్కెట్‌లో ఉన్న కొన్ని పాపులర్ ఫోన్‌లకు గట్టి పోటీని ఇవ్వబోతున్నాయి. ఒప్పో రెనో 14 5G ఫోన్ ముఖ్యంగా వివో V50 5G (ధర రూ.36,999), షియోమి 14 CIVI (ధర రూ.38,999) ఫోన్‌లకు పోటీ ఇస్తుంది. ఒప్పో రెనో 14 ప్రో 5G వేరియంట్ అయితే ఐకూ 12 5G (ధర రూ.54,990), వివో V40 ప్రో (ధర రూ.49,145) లాంటి ఫోన్‌లతో పోటీ పడుతుంది.