Homeబిజినెస్Oil Prices: సామాన్యులకు తీపికబురు.. భారీగా తగ్గనున్న వంటనూనెల ధరలు?

Oil Prices: సామాన్యులకు తీపికబురు.. భారీగా తగ్గనున్న వంటనూనెల ధరలు?

Oil PricesOil Prices: గత కొన్ని నెలలుగా అంతకంతకూ పెరుగుతున్న వంటనూనె ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వంటనూనె ధరలను తగ్గిస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుభాశ్ పాండే సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరేలా తీపికబురు అందించారు. డిసెంబర్ నెల నుంచి వంటనూనె ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని సుభాశ్ పాండే చెప్పుకొచ్చారు.

డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్ లో సైతం వంటనూనె ధరలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని సుభాష్ పాండే పేర్కొన్నారు. సంవత్సర కాలంలో వంటనూనె ధరలు ఏకంగా 64 శాతం మేర పెరగడం గమనార్హం. వంటనూనె ధరలు పెరగడంతో హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు సైతం ఊహించని స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరగడం వల్ల కూడా వంటనూనె ధరలు పెరిగాయి.

ప్రజలలో చాలామంది వంటకాల కోసం సన్ ఫ్లవర్ ఆయిల్ తో పాటు గ్రౌండ్ నట్ ఆయిల్ ను వినియోగిస్తారు. ఈ రెండు వంటనూనెల ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. పామాయిల్ విక్రయ ధర 64 శాతం పెరగగా సోయాబిన్ ఆయిల్ ధర 51.2 శాతం పెరిగింది. సన్ ఫ్లవర్ ఆయిల్ ధర, ఆవ నూనె ధర, గ్రౌండ్ నట్ ఆయిల్ ధర 46 శాతం పెరుగుదలతో లీటర్ 150 రూపాయలకు చేరుకున్నాయి.

ధరలు భారీగా తగ్గాలని సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వంటనూనెలపై సుంకాలను తగ్గించి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేయాలని సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు కోరుతున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper