
Bigg Boss Telugu 5: బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ గ్రాండ్ గా మొదలైంది. అదిరిపోయే గేములు, టాస్కులతో టీవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈసారి షోలో అందరు యువకులు, సినీ, టీవీ రంగాలకు చెందిన వారికే పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని ఐదో సీజన్ లోకి ఇది అడుగు పెట్టింది. స్టార్ హీరో నాగార్జున వ్యాఖ్యతగా ఆదివారం గ్రాండ్ ఎంట్రీతో షో ప్రారంభమైంది. క్లాస్ మాస్ సాంగ్ లతో నాగార్జున ఎంట్రీ అదిరింది. ఈసారి ఐదురెట్లు వినోదాన్ని పంచడానికి రెడీ అని నాగార్జున ప్రకటించారు. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ మరింత అందంగా ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు. అద్భుతంగా ఉందని చెప్పొచ్చు.
తొలి కంటెస్టెంట్ గా సిరి హన్మంతు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సన్నీ, లహరి, శ్రీరామచంద్ర, అనీ మాస్టర్, లోబో లు చివరగా యాంకర్ రవి ఇలా వరుసగా 19 కంటెస్టెంట్లను నాగార్జున పరిచయం చేస్తూ వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు.
బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 70 కెమెరాలున్నాయి. బిగ్ బాస్ హౌస్ ఎక్కువగా ఆకుపచ్చ, బంగారు వర్ణంతో తీర్చిదిద్దారు.
*బిగ్ బాస్ 19 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే…
1.యూట్యూబర్ సిరి,
2 వీజే సన్నీ,
3 లహరి శారి,
4 సింగర్ శ్రీ రామ్ చంద్ర,
5 డ్యాన్స్ మాస్టర్ అనీ,
6 లోబో,
7 ప్రియా,
8 జెస్సీ (సూపర్ మోడల్ ర్యాంప్ వాకర్),
9 ట్రాన్స్ జెండర్ జబర్దస్త్ ప్రియాంక,
10 షణ్ముఖ్ జస్వంత్,
11 హమీదా ఖాటూన్,
12 నటరాజ్ మాస్టర్,
13 సరయు,
14 యాక్టర్ విశ్వా,
15 ఉమాదేవి (సీరియల్ నటి),
16 నటుడు మానస్ నాగులపల్లి,
17 ఆర్.జే కాజల్ (రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్),
18 శ్వేతా,
19 యాంకర్ రవి..