Edible Oil: రష్యా ఉక్రెయిన్ సంక్షోభం వంటనూనెల ధరలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులు ప్రస్తుతం వంటనూనెలను కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. దేశంలో వంట నూనెల ధరలు అంచనాలకు అందని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. మన దేశానికి ఉక్రెయిన్, రష్యా దేశాల నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ ను ప్రాసెస్ చేయడానికి అవసరమైన ముడి సరుకు లభిస్తుంది.

అయితే ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వంటనూనెల ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో వంటనూనెల ధరలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. యుద్ధం వల్ల 6 లక్షల టన్నుల వంటనూనె కొరత ఏర్పడే అవకాశం ఉందని ఈ కొరత సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలతో పాటు ఇతర వంటనూనెల రేట్లపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉందని బోగట్టా.
Also Read: YCP Leader: మహిళానేతపై అలాంటి కామెంట్ చేసిన వైసీపీ నేత.. ఇంత దారుణమా..?
రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వంటనూనెలకు సంబంధించి స్వల్పకాలిక సరఫరా అంతరాయాలు ఎదురుకావచ్చని వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల తర్వాత్ అర్జెంటీనా నుంచి మన దేశానికి ముడి పొద్దుతిరుగుడు నూనె వస్తుంది. ఇప్పటికే పెరుగుతున్న ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, టోల్ ఛార్జీలు అంతకంతకూ పెరగడంతో సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంటనూనెల ధరలను తగ్గించే దిశగా అడుగులు వేస్తే మంచిదని చెప్పవచ్చు.
Also Read: Prabhas Adipurush: ఏ- ఆది పురుష్” పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్