AIIMS Recruitment 2021: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఏపీలోని మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లెక్చరర్ ఇన్ నర్సింగ్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పోస్టులతో పాటు ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు.
మొత్తం 6 ఉద్యోగ ఖాళీలలో ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్ పోస్ట్ ఒకటి ఉండగా లెక్చరర్ ఇన్ నర్సింగ్, కాలేజ్ ఇన్ నర్సింగ్ పోస్టులు 5 ఉన్నాయి. ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు నర్స్ అండ్ మిడ్‌వైఫ్ లో రిజిష్టర్ కావడంతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
నర్సింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావడంతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే లెక్చరర్ ఇన్ నర్సింగ్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 50 సంవత్సరాల లోపు వయస్సు ఉండి సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
లెక్చరర్ ఇన్ నర్సింగ్(అసిస్టెంట్ ప్రొఫసర్), కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 67,700 రూపాయల నుంచి 2,08,700 రూపాయల వరకు వేతనంగా చెల్లిస్తారు. ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.1,23,100 నుంచి 2,15,900 వేతనం చెల్లిస్తారు. సెప్టెంబర్ 14వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.