spot_img
Homeబిజినెస్Oben Rorr electric bike: తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ బైక్ ఇదే..

Oben Rorr electric bike: తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ బైక్ ఇదే..

Oben Rorr electric bike: పెట్రోల్ ధరలతో పాటు, పర్యావరణ కాలుష్యం తీవ్రం కావడంతో ఎలక్ట్రిక్ బైక్ లపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. మొదట్లో వీటిపై కాస్త ఆందోళనకర వాతావరణ ఉండగా.. ఆ తర్వాత చాలామందికి అవగాహన కలిగి EV లను కొనుగోలు చేస్తున్నారు. అయితే మార్కెట్లోకి ఎన్నో కంపెనీలు EV లను తీసుకువచ్చినా కూడా కొన్ని మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇందులో ఉండే బ్యాటరీ వ్యవస్థతోపాటు సర్వీస్ కూడా మెరుగ్గా ఉండడంతో వీటిపై ఆసక్తి చెబుతున్నారు. అలాంటి వాటిలో Oben ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఒకటి. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

OBEN కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎన్నో రకాల బైక్ లు మార్కెట్లోకి వచ్చాయి. మిగతా వాటికంటే ఈ కంపెనీ విశేషం ఏంటంటే ప్రతి ఏడాది అభివృద్ధి చెందుతూనే ఉంది. కొన్ని నివేదికల ప్రకారం 375 శాతం వృద్ధిని సాధించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా భారతదేశం వ్యాప్తంగా తన షోరూమ్లను విస్తరించి కస్టమర్లకు అందుబాటులోకి బైక్ లను తీసుకురావాలని అనుకుంటుంది. తక్కువ మెయిన్టెనెన్స్ తో పాటు, మైలేజ్ స్థిరంగా ఉండడంతో చాలామంది వాహనదారులు దీనిపై నమ్మకం పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే బ్యాటరీ వ్యవస్థ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ లలో LLP బ్యాటరీస్ ఉండనున్నాయి. ఈ బ్యాటరీలను కంపెనీ సొంతంగా తయారు చేస్తుంది. అంతేకాకుండా వెహికిల్ కు సంబంధించిన చార్జర్లను కూడా కంపెనీ సొంతంగా తయారు చేయడం విశేషం.

Also Read: 7 సీటర్ కారు.. 45 కిలోమీటర్ల మైలేజ్.. ఇంతకుమించి ఏదైనా కారు ఉందా?

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో 3.5 ఎకరాల స్థలంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న OBEN .. వినియోగదారులకు అనుకూలంగా ఉండే వాహనాలను అందిస్తోంది. అంతేకాకుండా ఎలాంటి వాతావరణం లోనైనా కన్వీనెంట్ గా ఉండేలా తయారు చేస్తోంది. ఈ కంపెనీ నుంచి Rorr అనే బైక్ ధర రూ.1.49 లక్షలు గా ఉంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 155 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కేవలం మూడు సెకన్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరో బైక్ Rorr EZ సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూపొందించింది. ఎందుకంటే ఈ బైక్ ధర రూ.99,999 తో విక్రయిస్తున్నారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 175 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అలాగే Rorr EZ Sigma అనే బైక్ ధర రూ.1.09 లక్షలు గా ఉంది. దీనిని ఒకసారి చార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

రోజువారి వినియోగదారులతోపాటు, ఉద్యోగులు, వ్యాపారులు తమకు అనుకూలంగా ఉండేందుకు ఈ బైక్స్ ఎంతో బెస్ట్ అని అంటున్నారు. తక్కువ ధరలో కొనుగోలు చేసి మైలేజ్ ఎక్కువగా ఉండటంతో చాలామందికి ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper