Car : ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ మయం అయిపోతుంది. చాలా మంది కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకునేవారు విద్యుత్ కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇదే సమయంలో Best Safety కార్ల కోసం సెర్చ్ చేస్తున్నారు. మార్కెట్లో ఎన్నో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే సేప్టీ రేటింగ్ ను పొందాయి. కానీ తాజాగా TaTa మోటార్స్ కు చెందిన నెక్సాన్ కారు బెస్ట్ సేప్టీ కారుగా నమోదైంది. ఇటీవల నిర్వహిచిన క్రాస్ టెస్టింగ్ లో ఈ కారు 5 స్టార్ రేటింగ్ ను పొందింది. అంతేకాకుండా ఈ కారు మైలేజ్ గురించి తెలిసి ఆశ్చర్య పోతున్నారు. ఇంతకీ ఈ కారు పూర్తి వివరాల్లోకి వెళితే.
Also Read : టాటా నెక్సాన్ ఈవీ టెస్టులో పాస్ అయిందా.. నిజంగా కంపెనీ చెప్పినంత రేంజ్ ఇస్తుందా ?
దేశంలో టాటా కంపెనీకి చెందిన కార్లు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటాయి. ఇటీవల ఎలక్ట్రిక్ కార్ల విషయంలోనూ మిగతా కార్ల కంటే టాటా కార్లు గట్టిపోటీని ఇస్తున్నాయి. ఇప్పటి వరకు టాటా కంపెనీకి చెందిన టియాగో, ఆల్ట్రోస్, హరియన్, సఫారీ కార్లు సేప్టీలో 5 స్టార్ రేటింగ్ ను పొందాయి. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ లో నెక్సాన్ అదే స్థాయిలో రేటింగ్ ను నమోదు చేసుకుంది. దీంతో సేస్టీ విషయంలో ఈ కంపెనీ రాజీ పడడం లేదని అర్థమవుతోంది.
తాజాగా టాటా కంపెనీకి చెందిన Nexonను ఇటీవల భారత NCAPటెస్టింగ్ ను నిర్వహించారు. ఈ టెస్టింగ్ లో నెక్సాన్ కారు 5 స్టార్ రేటింగ్ ను పొందింది. ఇందులో భాగంగా పెద్దల భద్రత విషయంలో 32 పాయింట్లకు 29.86 పాయింట్లు సాధించింది. పిల్లల సేప్టీ విషయంలో 49 పాయింట్లకు 44.95 పాయింట్లు సాధించింది.అలాగే ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో ప్రతీ సీటుకు పాయింట్ సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్ లు ఉన్నాయి. ఇక ఈ కారులో బ్యాక్ సైడ్ వ్యూ కెమెరా.. 360 డిగ్రీ ల సరౌండ్ వ్యూ ఉన్నాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ తో పాటు ఆకట్టుకునే సేప్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఈ కారులో 45 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేసత్ే 489 కిలోమీరట్ల మైలేజ్ ఇస్తుంది. ఇది 40 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ అవుతుంది. లాంగ్ డ్రైవ్ తో పాటు రోజూవారి అవసరాలకు ఉపయోగించేవారికి ఈ కారు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కారు 142 బీహెచ్ పీ పవర్ తో పాటు 215 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఇందులో లేటేస్ట్ వినియోగదారులు కోరుకునే సన్ రూఫ్ ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ కారు మార్కెట్లో రూ.12.49 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 13.99 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
Also Read : ఎగబడి కొంటున్నారు.. ఈ కారు గురించి తెలుసా?