Theaters: ఒకప్పుడు సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తూ ఆనందించేవారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమా డెఫినేషన్ మారిపోయింది… సినిమాలను చూసే జనాల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. కారణం ఏదైనా కూడా ఒక సినిమాకి సక్సెస్ ఫుల్ టాక్ వస్తేనే సినిమాని చూస్తున్నారు. లేకపోతే మాత్రం వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయా సినిమాలను స్కిప్ చేస్తున్నారు…
Also Read: ఆకట్టుకుంటున్న ‘సింగిల్’ థియేట్రికల్ ట్రైలర్..మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసిన శ్రీవిష్ణు!
సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సినిమాని ప్రేక్షకులు చూసి ఆ సినిమా సక్సెస్ సాధించిందా? లేదంటే ఫెయిల్యూర్ గా మిగిలిందా? అనే జడ్జిమెంట్ ని తెలియజేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే గత కొద్ది సంవత్సరాల నుంచి థియేటర్లలో సినిమాలను చూసే జనాభా చాలా వరకు తగ్గిపోయింది అంటూ చాలా రోజుల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక దీనికాంతటికి కారణం సినిమాను మించిన ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుడికి ఇంట్లోనే దొరుకుతుండటం వల్ల థియేటర్ కి వచ్చి సినిమాలు చూసి ఎంజాయ్ చేసే అంత టైం అయితే లేకుండా పోతుంది. ముఖ్యంగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అన్ని భాషల వెబ్ సిరీస్ లు, సినిమాలు అవలెబుల్ ల్లో ఉండటం వల్ల సగటు ప్రేక్షకులు థియేటర్ కి రావాలనే ఆలోచనను మానుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో థియేటర్ యాజమాన్యులు మాత్రం వాటి రెంట్స్ పే చేయడానికి మిగతా అలవెన్స్ లకు కూడా టికెట్ డబ్బులు సరిపోవట్లేదు. ఇక సినిమా ప్రొడ్యూసర్లకి, డిస్టిబూటర్లకి మేమేం చెల్లించాలి అంటూ వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా థియేటర్లలో సినిమా చూసే జనాల సంఖ్య తగ్గిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి.
కరోనాకి ముందు వరకే థియేటర్లలో మంచి సక్సెస్లను సాధించిన సినిమాలు ఉన్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఏమాత్రం ఇబ్బంది పడలేదు. కానీ కరోనా నుంచి ఓటిటి ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోవడం వల్ల వాటి సబ్ స్క్రిప్షన్ తీసుకున్న జనాలు స్వతహాగా థియేటర్ కి వచ్చి సినిమా చూడడం మానేశారు. ఇక మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి మరొక కారణం ఏంటంటే మూవీ రిలీజ్ అయిన వారంలోపే ఓటిటిలోకి వస్తున్నాయి.
కాబట్టి అక్కడే సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు అనే భావనలో ప్రేక్షకుడు ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలో థియేటర్లకి పునర్ వైభవం రావాలి అంటే మాత్రం చాలా కసరత్తులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాలకి కూడా ఆదరణ అయితే దక్కడం లేదు.
మహా అయితే సినిమా రిలీజ్ అయిన రెండు మూడు రోజుల తర్వాత ఏ థియేటర్ కూడా హౌస్ ఫుల్ కావడం లేదనేది డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎగ్జిక్యూటర్ల నుంచి వస్తున్న సమాధానం.. మరి ఇదిలానే కొనసాగితే మాత్రం థియేటర్లన్నీ మూతపడాల్సిన అవసరమైతే ఉంటుంది ఇప్పటికే చాలా థియేటర్లను ఫంక్షన్ హాల్స్ గా మారుస్తున్నారు…ఒక దానిమీద ఇండస్ట్రీ మొత్తం ఒకసారి దృష్టి సారిస్తే మంచింది. లేకపోతే థియేటర్లు మూసివేయాల్సిన పరిస్థితి రావచ్చు…
Also Read: పెళ్లయిన స్టార్ హీరోతో ఎఫైర్ నడిపి కెరీర్ నాశనం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్…