https://oktelugu.com/

Tata Nexon : ఎగబడి కొంటున్నారు.. ఈ కారు గురించి తెలుసా?

టాటా కంపెనీకి చెందిన నెక్సాన్ ను అప్ గ్రేడ్ తో 2023లో రిలీజ్ చేసింది. ఈ ఏడాదిలో దీనిని బాగా ఆదరించారు. ఇంతలా ఆదరిస్తున్నారంటే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 7, 2024 / 01:31 PM IST

    Tata Nexon

    Follow us on

    Tata Nexon :కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది. దీంతో కొత్త కొత్త ఫీచర్లతో కొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఫేమస్ అయిన కొన్ని మోడళ్లను అప్ గ్రేడ్ చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.ఇప్పటికే మారుతి, హ్యుందాయ్ లాంటి కార్లు పాత వాటిని మారుస్తూ తీసుకొచ్చాయి.ఇదే బాటలో టాటా కంపెనీకి చెందిన నెక్సాన్ ను అప్ గ్రేడ్ తో 2023లో రిలీజ్ చేసింది. ఈ ఏడాదిలో దీనిని బాగా ఆదరించారు. ఇంతలా ఆదరిస్తున్నారంటే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

    టాటా కంపెనీ నుంచి 2017లో మార్కెట్లోకి వచ్చింది నెక్సాన్(Nexon). SUV వేరియంట్ లో వచ్చిన ఈ కారు అప్పట్లో సౌకర్యవంతంగా ఉండడంతో చాలా మంది దీనిని ఆదరించారు. విశాలమైన స్పేస్ తో పాటు బాహుబలి లాంటి ఇంజిన్ ను కలిగి ఉండడంతో దీనిని సొంతం చేసుకోవడానికి ఎగబడ్డారు. అయితే దీనిని 2020లో ఫేస్ లిఫ్ట్ గా మార్చి సరికొత్త డిజైన్ తో తీసుకొచ్చారు. అలాగే నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు కూడా వినియోగదారులకు పరిచయం అయింది. 2023 ఏడాదిలో మరింత అప్డేట్ అయి కొత్త కారుగా మార్కెట్లోకి వచ్చింది.

    గతేడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు 70 వేలకు పైగా అమ్మకాలు జరుపుకుంది. 2022 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో నెక్సాన్ నిలవడం విశేషం. టాటా నెక్సాన్ ను రూ.8.1 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 15.5 లక్షల వరకు విక్రయించారు. సాధారణంగా ఎస్ యూవీ అంటే రూ.10 లక్షలకు పైమాటే. కానీ నెక్సాన్ మాత్రం రూ.8.1 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇంతలా ఆదరిస్తున్నారంటే ఈ కారు ఫీచర్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

    టాటా నెక్సాన్ ఫీచర్లు ఒక రకంగా అద్భుతం అని చెప్పవచ్చు. ఇందులో టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆకర్షిస్తుంది. 1199 సీసీ ఇంజిన్ తో 113 బీహెచ్ పీ పవర్, 260 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ ఇంధనానికి ఇది 17 నుంచి 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రియల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వంటికి ఆకర్షిస్తాయి. టాటా నెక్సాన్ లో స్మార్ట్, స్మార్ట్ ప్లస్, స్మార్ట్ ప్లస్ ఎస్, వంటి వేరియంట్లు ఉన్నాయి. టాటా