Nissan x Trail : భారతదేశంలో టయోటా ఫార్చ్యూనర్ క్రేజ్‌ను తట్టుకునే కార్లు చాలా తక్కువ. అలాంటి వాటిలో ఒక కారు ఇప్పుడు దాని అసలు ధర కంటే దాదాపు 20 లక్షల రూపాయలు తక్కువకు లభిస్తోంది. ఈ లెక్కన చూస్తే.. ఇది ఫార్చ్యూనర్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అయితే, ఈ ధరలో కారు కొనడానికి ఒక ప్రత్యేకమైన ట్విస్ట్ ఉంది. ఈ కారు సరికొత్తగా, ఎటువంటి రిజిస్ట్రేషన్ హిస్టరీ లేకుండా లభిస్తుంది.
ఫార్చ్యూనర్‌కు పోటీనిచ్చే ఈ 7-సీటర్ SUV మరేదో కాదు నిస్సాన్ ఇండియా ఫ్లాగ్‌షిప్ మోడల్ నిస్సాన్ ఎక్స్-ట్రైల్. వాస్తవానికి 49.92 లక్షల రూపాయల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభమయ్యే ఈ కారు.. ప్రస్తుతం కొన్ని వేదికలపై 20 లక్షల రూపాయలు తక్కువగా, అంటే కేవలం 29.50 లక్షల రూపాయలకే అందుబాటులో ఉంది.
Also Read : వేస్ట్ అనుకున్న కారుతో బెస్ట్ ఇన్కమ్..పాత జిప్సీతో లక్షలు సంపాదిస్తున్నాడు
ఇక్కడ చౌకగా లభిస్తున్న కొత్త కారు
సరికొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌ను కేవలం 29.50 లక్షల రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఇది మీకు నిస్సాన్ ఇండియా అధికారిక ఛానెల్ ద్వారా లభించదు. బదులుగా, సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లను విక్రయించే వేదిక అయిన బిగ్ బాయ్ టాయ్జ్‌లో నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఈ ధరతో లిస్ట్ చేశారు. ఈ కారు ఎక్కడా రిజిస్టర్ కాలేదు. అంటే, ఈ కారు మొదటి యజమాని మీరే కాబోతున్నారు. ఇది CVT ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఆటోమేటిక్ SUV, దీని స్పీడ్ మీటర్ ప్రకారం ఇది ఇప్పటివరకు సున్నా కిలోమీటర్లు మాత్రమే నడిచింది.
ఈ 5-డోర్ 7-సీటర్ SUV మేడ్ ఇన్ ఇయర్ 2024. పెట్రోల్-హైబ్రిడ్ సిస్టమ్‌పై నడిచే ఈ కారులో ఎక్స్ ట్రా డబ్బు చెల్లించి 12.3 అంగుళాల మల్టీమీడియా టచ్‌స్క్రీన్‌ను పొందవచ్చు. అలాగే దీని ఇంటీరియర్‌కు లెదర్ అప్‌హోల్‌స్ట్రీతో మరింత ప్రీమియం లుక్ ఇచ్చారు. బిగ్ బాయ్ టాయ్జ్ ఇన్వెంటరీలో ప్రస్తుతం నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 2 యూనిట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఈ కారులో 1498సీసీ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ లభిస్తుంది. ఇది 161 bhpపవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఒక లీటరుకు 13.7 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారులో ఒకసారి 55 లీటర్ల పెట్రోల్ వస్తుంది. కారులో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 360 డిగ్రీ కెమెరా, 7 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా లభిస్తాయి.