Viral Photo : ఈ అందమైన ప్రేమ కథ చిత్రంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికీ కూడా ఈ సినిమా టీవీలో ప్రసారమైతే చాలామంది ఎంతో ఇష్టంగా చూస్తారు. అందమైన ప్రేమ కథ చిత్రాలలో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో సందేహం లేదు. యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరికెక్కిన ఈ సినిమాకు సెల్వరాఘవం దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో సుమన్ శెట్టి, చంద్రమోహన్, సుధా, మనోరమా వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. 2004 నవంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాకు కుర్ర కారు ఫిదా అయ్యి థియేటర్లకు పరుగులు పెట్టేవారు. ఈ సినిమాలోని పాటలు అన్నీ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఈ సినిమా చూసిన వాళ్లు చాలామంది బయటకు వచ్చేటప్పుడు ఎంతో బాధతో బయటకు వస్తారు. ఈ సినిమాలో హీరో రవి కృష్ణ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
Also Read : 16 ఏళ్ళ సినీ కెరియర్ లో కేవలం ఒక్క హిట్టు మాత్రమే అందుకున్న రామ్ చరణ్ హీరోయిన్..
ఒక సోనియా అగర్వాల్ అయితే హీరోయిన్ గా ఇప్పటికీ కురకారు హృదయాల్లో నిలిచిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత సోనియా అగర్వాల్ తెలుగుతోపాటు తమిళ్లో కూడా పలు సినిమాలలో నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఒక సినిమాలో నటించింది సోనియా అగర్వాల్. కెరియర్ వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలోనే దర్శకుడు సెల్వా రాఘవన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లయిన కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య కలహాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత సోనియా అగర్వాల్ సింగిల్ గా తన జీవితం సాగిస్తుంది. ఒకపక్క సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూనే మరోవైపు పలు టీవీ షోస్ లో కూడా సందడి చేస్తుంది.
సోనియా అగర్వాల్ తెలుగులో టెంపర్, విన్నారు, రెడ్ వంటి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది. గత ఏడాది సోనియా తమిళ్లో మూడు సినిమాలలో నటించింది. ప్రస్తుతం కూడా సోనియా అగర్వాల్ చేతిలో పలు తమిళ్ సినిమాలు ఉన్నట్లు సమాచారం. అలాగే 7/G బృందావన కాలనీ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కబోతుందని సమాచారం. కానీ ఈ సీక్వెల్లో సోనియా నటించడం లేదని సమాచారం. ఎందుకంటే మొదటి భాగంలోనే సోనియా పాత్ర ముగుస్తుంది. సినిమాలు, టీవీ షోలు అలాగే సోషల్ మీడియాలో కూడా సోనీ అగర్వాల్ చాలా బిజీగా ఉంటుంది. తన ఫ్యాషనబుల్ ఫోటోలను నిత్యం షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా బరువు తగ్గి నాజుగ్గా మారిన సోనియా అగర్వాల్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో అందరిని ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram