New Cars : కారు కొనే విషయంలో వినియోగదారులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా వెంటనే వాటిని తీసుకోవాలని అనుకుంటారు. కొందరు కొత్తగా కారు కొనాలనుకునేవారు సైతం కొత్త మోడల్ కోసమే ఎదురు చూస్తారు. అయితే మారుతి కంపెనీ నుంచి వచ్చిన ఓ మోడల్ దశాబ్దాలుగా తిరుగులేని కార్గా నిలుస్తోంది. ఈ కారు వచ్చినాక మార్కెట్లోకి ఎన్నో మోడల్స్ వచ్చిన వాటిని అధిగమిస్తూ సేల్స్ లో రాణిస్తుంది. ఇప్పుడు కూడా టాప్ టెన్ లెవెల్ లో నిలిచిన ఈ కారు గురించి ఆసక్తిగా చర్చ జరుగుతోంది. తక్కువ ధరతోపాటు, మిడిల్ క్లాస్కు అనుగుణంగా ఉన్నాయి కారు ఏదంటే?
మిడిల్ క్లాస్ పీపుల్స్ కొత్తగా కారు కొనాలని అనుకుంటే మారుతి కంపెనీ వైపే చూస్తారు. ఈ కంపెనీ నుంచి లో బడ్జెట్ కారు ఉంటుందని చాలామంది భావన. అంతేకాకుండా ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇందులో భాగంగా దశాబ్దాల కింద వచ్చిన మారుతి స్విఫ్ట్ కారు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది. ఇది నేటి తరాన్ని ఆకర్షించేందుకు గత ఏడాదిలో కొత్తగా రూపుదిద్దుకుంది. దీంతో ఈ కారు సేల్స్ మరింతగా పెరిగాయి. అయితే మార్కెట్లోకి ఎన్నో కొత్త కార్లు వచ్చాయి. వాటికి డిమాండు పెరుగుతున్న నేపథ్యంలోనూ మారుతి సుజుకి స్విఫ్ట్ కు ఆదరణ తగ్గడం లేదు.
Also Read : మార్కెట్లోకి త్వరలో రాబోతున్న 5 కొత్త కార్లు ఇవే..
2025 ఏప్రిల్ నెలలో మారుతి సుజుకి స్విఫ్ట్ ను 14,592 యూనిట్లు అమ్ముడుపోయాయి. దీంతో గత నెలలో టాప్ టెన్ లెవెల్ లో ఏడో స్థానంలో నిలిచింది. ఈ నెలలో అత్యధికంగా ఉందా ఈ క్రెటా అమ్మకాలు జరిగి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో మారుతి డిజైర్ తో పాటు బ్రెజ్జా, ఎర్టిగాలు వరుసగా నిల్చాయి. ఆ తర్వాత ఏడో స్థానంలోనూ మారుతి సుజుకి స్విఫ్ట్ రావడం విశేషం. అయితే కొత్తగా రూపుదిద్దుకున్న స్విఫ్ట్ను ఎక్కువ మంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఆకర్షనీయమైన టీచర్స్ ఉండడమే కారణం.
ఈ కారులో ఏసీ వంటి సదుపాయాలను కొత్తగా మార్చారు. అలాగే 9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్ కు అనుగుణంగా ఉండేందుకు నావిగేషన్ ఫంక్షన్లు ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ విషయంలో 360 డిగ్రీ కెమెరా ఆకర్షిస్తుంది. అలాగే మొబైల్ ఛార్జింగ్ కోసం డ్యూయల్ చార్జింగ్ పోర్టు వంటి సదుపాయాలు ఉన్నాయి.
ఇక ఈ కారు మార్కెట్లో 6.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఎక్కువగా మధ్య తరగతి వినియోగదారుల కోసం ఉపయోగపడే ఈ కారును ఇప్పటికే చాలామంది కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం పోటీ ప్రపంచంలోను ఈ పాత కారం కోసం ఎదురుచూసేవారు ఉండడం ఆసక్తిగా మారింది.
Also Read : సెప్టెంబర్ లో మార్కెట్ లోకి కొత్త కార్లు వాటి ధరలు,ఫీచర్లు మీకోసం..