New cars In September : సెప్టెంబర్ లో మార్కెట్ లోకి కొత్త కార్లు వాటి ధరలు,ఫీచర్లు మీకోసం..

ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆఫ్ ఇయర్ లో కార్లు మార్కెట్లోకి వచ్చిన సంఖ్య తక్కువే అని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ తో పాటు పలు కారణాల వల్ల చాలా వరకు కార్లు బయటకు రాలేదు. అయితే ఈ సెప్టెంబర్ లో కొన్ని మోడళ్లు విడుదల కాబోతున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : August 29, 2024 5:38 pm

New cars in September

Follow us on

New cars In September :  కార్లు కొనేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు మంచి ఫీచర్స్ కలిగిన కార్లు ఇప్పటికే మార్కెట్లో ఉన్నా లేటేస్ట్ టెక్నాలజీ ఉపయోగించి డ్రైవింగ్ కు అనుగుణంగా ఉండే కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆఫ్ ఇయర్ లో కార్లు మార్కెట్లోకి వచ్చిన సంఖ్య తక్కువే అని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ తో పాటు పలు కారణాల వల్ల చాలా వరకు కార్లు బయటకు రాలేదు. అయితే ఈ సెప్టెంబర్ లో కొన్ని మోడళ్లు విడుదల కాబోతున్నాయి. ఆ కార్ల గురించి తెలుసుకుందాం..

దేశంలో టాప్ లెవల్లో ఉన్న కార్ల కంపెనీల్లో టాటా ఒకటి. ఈ కంపెనీ నుంచి దాదాపు ఎస్ యూవీలు మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకున్నాయి. అయితే కాలం మారుతున్న కొద్దీ ప్యాసింజర్స్ ను ఆకట్టుకునే విధంగా కొత్త కార్లను తీసుకురావడంలో టాటా కంపెనీ ముందు ఉంటుంది. ఈ తరుణంలో సెప్టెంబర్ లో టాటా నుంచి కొత్త కారు రాబోతుంది. అదే కర్వ్. అయితే టాటా కర్వ్ ఈవీని ఆగస్టు 7న మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంజిన్ తో కూడుకున్న కారును సెప్టెంబర్ లో మార్కెట్లోకి తీసుకురానున్నారు. కర్వ్ ఈవీ, ఇంజిన్ వాహనాలు చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. కానీ వీటి ఇంజిన్ లో తేడాలు ఉంటాయి. కొత్త కర్వ్ లో 1.2 లీటర్ పెట్రోల్, 3 సిలిండర్ టర్బో ఇంజిన్ ఎండనుంది. అలాగే 1.2 లీటర్ , 3 సిలిండర్ అనే మరో ఇంజిన్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ కలిపి మొత్తం మూడు ఇంజిన్లు ఉంటాయి. దీని ధర రూ. 10 లక్షల లోపే ఉంటుందని అంటున్నారు.

దేశంలోని టాప్ లెవల్లో ఉన్న కార్ల కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. ఈ కంపెనీ నుంచి అల్కాజర్ రాబోతుంది. దీనిని వచ్చే నెలలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఎస్ యూవీ వేరియంట్ లో ఉన్న కారు త్వరలో ఫేస్ లిప్ట్ వెర్షన్ ని సెప్టెంబర్ లో తీసుకురానున్నారు. కొత్త అల్కాజర్ ఇంజిన్ వివరాలు బయటకు రానప్పటికీ ఇందులో 10.25 అంగుళాల స్క్రీన్లు, పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయని తెలుస్తోంది. వైర్ లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ తో పాటు ఇతర ఫీచర్లు ఆకట్టుకోనున్నాయి.

మారుతి కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కంపెనీ సైతం సెప్టెంబర్ లో కొత్త కారును మార్కెట్లోకి తీసుకొస్తుంది. అదే డిజైర్. ఇప్పటికే డిజైర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పుడు డిజైర్ నెక్ట్స్ జనరేషన్ ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇందులో ఆధునిక టెక్నాలజీకి ఫీచర్లతో పాటు ఆకట్టుకునే డిజైన్ ఉండనుంది. ఎంజీ మోటార్స్ నుంచి విండర్స్ ఈవీ నుంచి సరికొత్త ఈవీ మార్కెట్లోకి రాబోతుంది. దీనిని సెప్టెంబర్ 11న లాంచ్ చేయనున్నారు. దీనిని రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు.