https://oktelugu.com/

New Cars: ఈ కార్ల మైలేజ్ 30 కిలోమీటర్ల పైనే.. ఏవో తెలిస్తే షాక్ అవుతారు..

కారు కొనే సమయంలో చాలామంది బ్రాండ్ ను చూస్తారు. ఇంకొంతమంది ఫీచర్స్, ఇంజన్ పరీక్షిస్తారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్స్ కారు కొనాలని అనుకున్న సమయంలో మైలేజ్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 9, 2025 / 11:43 AM IST

    New cars

    Follow us on

    New Cars: కారు కొనే సమయంలో చాలామంది బ్రాండ్ ను చూస్తారు. ఇంకొంతమంది ఫీచర్స్, ఇంజన్ పరీక్షిస్తారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్స్ కారు కొనాలని అనుకున్న సమయంలో మైలేజ్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అందుకే కొన్ని కంపెనీలు మైలేజ్ ను దృష్టిలో ఉంచుకొని కార్లను మార్కెట్లోకి తీసుకొస్తుంటాయి. సాధారణంగా కార్లు లీటర్ ఇంధనానికి 19 నుంచి నుంచి 25 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి. కానీ కొన్ని కార్లు మాత్రం 30 కిలోమీటర్ల పైనే మైలేజ్ ని ఇచ్చి ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ కార్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి అత్యధిక మైలేజ్ ఇచ్చే ఆ కార్లు ఏవో తెలుసుకోవాలని ఉందా..? అయితే కిందికి వెళ్ళండి..

    దేశంలో మారుతి కార్లకు ఉన్న క్రేజ్ అంతా అంతా కాదు. ఈ కంపెనీ నుంచి ఏ కారు రిలీజ్ అయిన దాని గురించి కచ్చితంగా తెలుసుకుంటారు. హ్యాచ్ బ్యాక్ నుంచి SUV కార్ల వరకు మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ దిగ్గజం నుంచి వెలువడిన గ్రాండ్ విఠారా 7 సీటర్ SUV వేరియంట్ లో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ కారు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ తో త్వరలో మార్కెట్లోకి రానుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. అలాగే ఎలక్ట్రిక్ బ్యాటరీని కూడా చేర్చనున్నారు. దీంతో ఈ కారు 30 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే రూ. 20 నుంచి రూ.25 లక్షల వరకు ధర ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఏడాది జూన్ లోపు ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

    టయోటా కంపెనీ సైతం 7 సీటర్ కారును లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ కంపెనీ నుంచి అర్బన్ క్రూజర్ హై రైడర్ 7 సీటర్ రాబోతుంది. దీనిని మారుతి సుజుకి తో కలిసి తయారు చేస్తున్నారు. ఈ 7 సీటర్ జూన్ తర్వాత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిని రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది. టాటా అర్బన్ క్రూజర్ మోడల్ లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు బ్యాటరీ కూడా చేర్చి స్ట్రాంగ్ హైబ్రిడ్ గా తీసుకురానున్నారు. ఇది 114 బిహెచ్పి పవర్ తో ఉత్పత్తి చేనుంది. దీంతో ఇది కూడా 30 కిలోమీటర్లకు పైగానే మైలేజ్ ఇవ్వనుందన్న చర్చ సాగుతోంది.

    మారుతి నుంచి మరో మోడల్ ఫ్రాంక్స్ ఫేస్ లిప్ట్ గా మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫ్రాంక్స్ ఎంత పాపులర్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనిని ఫేస్ లిఫ్ట్ గా తీసుకురారున్నారు. ఇందులో 1.2 లీటర్ త్రీ సిలిండర్ 12 Eపెట్రోల్ మోటర్ ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ లీటర్ కు 30 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని అంటున్నారు.