మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds)లో డబ్బు ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్ లో 1500 రూపాయలు సిప్ చేయడం ద్వారా భారీ మొత్తంలో లాభాలను పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో 12 నుంచి 15 శాతం రాబడిని అందిస్తాయి.
నెలకు 1500 రూపాయల చొప్పున 35 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ మెంట్ కొనసాగిస్తే 12.5 శాతం రాబడి ప్రాతిపదికన మెచ్యూరిటీ సమయంలో ఏకంగా కోటీ 10 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే కేవలం రూ.59 లక్షలు పొందే అవకాశం ఉండగా 35 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 40 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఎక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్లకు మార్కెట్ రిస్క్ కూడా వర్తించే అవకాశాలు ఉంటాయి. తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో ఎక్కువ మొత్తం సంపాదించాలని భావించే వాళ్లకు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ బెస్ట్ స్కీమ్స్ అని చెప్పవచ్చు.