Homeఎంటర్టైన్మెంట్Tollywood Box Office: వినాయకచవితి సినిమాల పై గ్రౌండ్ రిపోర్ట్ !

Tollywood Box Office: వినాయకచవితి సినిమాల పై గ్రౌండ్ రిపోర్ట్ !

Tollywood Box OfficeTollywood Box Office:  కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అనంతరం తెలుగు బాక్సాఫీస్ (Box Office) వద్ద ప్రస్తుతం వరుస సినిమాల హడావుడి కొనసాగుతోంది. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిబంధనల మేరకు సినిమాలను ప్రదర్శిస్తునప్పటికీ.. సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం పోటీ అసలు తగ్గడం లేదు. మరి ఈ నెల మొదటి వారంలో వినాయకచవితిని పురస్కరించుకుని థియేటర్‌ ల్లో సందడి చేయబోతున్న సినిమాల పరిస్థితి ఏమిటో చూద్దాం.

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా వస్తోన్న ‘సీటీమార్’ సినిమాని వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమన్నా జ్వాలా రెడ్డి పాత్రలో నటిస్తోంది. మొత్తానికి ఈ సినిమాకి తమన్నా అందచందాలే అదనపు ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. అయితే గత కొన్నేళ్ళుగా తీవ్ర ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్న గోపీచంద్ కి ఈ సినిమా కీలకం కానుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఏవరేజ్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

విజయ్‌ సేతుపతి తమిళ చిత్రం ‘లాభం’. సెప్టెంబరు 9న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తమిళంలో మంచి హిట్ అయింది. మరి తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. అయితే, ఈ సినిమా పై ఎటువంటి అంచనాలు లేవు కాబట్టి.. కలెక్షన్స్ వచ్చే వరకు క్లారిటీ లేదు.

ఇక జయలలిత జీవిత కథ ఆధారంగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘తలైవి’. సెప్టెంబరు 10న తమిళ/తెలుగు భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం అన్ని సినిమాల్లో కల్లా ఈ సినిమాకే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

కాగా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘జాతీయ రహదారి’. దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో రానున్న ఈ సినిమా పై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ కూడా రావు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version