UP Elections: కులమే బలంగా రాజకీయ పార్టీల వ్యూహాలు

UP Elections: దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కులాల ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తున్నాయి. దేశంలో పెద్ద స్టేట్లయిన ఉత్తరప్రదేశ్ (UP), బిహార్ (Bihar) లు ఎక్కువ సీట్లు కలిగి ఉన్నాయి. అందుకే పార్టీలు వీటిపై ఆధారపడుతూ ఉంటాయి. యూపీలో 80, బిహార్ లో 40 ఎంపీ సీట్లున్నాయి. దీంతో ఇక్కడ విజయం సాధిస్తే అధికారం వశమవుతుందని పార్టీలు భావిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఇదే కోవలో ఆలోచించి రెండు సార్లు తన అధికారాన్ని కాపాడుకుంది. 2014 […]

Written By: Srinivas, Updated On : September 6, 2021 11:02 am
Follow us on

UP Elections: దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కులాల ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తున్నాయి. దేశంలో పెద్ద స్టేట్లయిన ఉత్తరప్రదేశ్ (UP), బిహార్ (Bihar) లు ఎక్కువ సీట్లు కలిగి ఉన్నాయి. అందుకే పార్టీలు వీటిపై ఆధారపడుతూ ఉంటాయి. యూపీలో 80, బిహార్ లో 40 ఎంపీ సీట్లున్నాయి. దీంతో ఇక్కడ విజయం సాధిస్తే అధికారం వశమవుతుందని పార్టీలు భావిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఇదే కోవలో ఆలోచించి రెండు సార్లు తన అధికారాన్ని కాపాడుకుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లకు గాను 73, బిహార్ లో 40 సీట్లకు గాను 33 స్థానాలు గెలుచుకుని తన ప్రతిష్ట నిలబెట్టుకుంది.

2019 ఎన్నికల్లో కూడా బీజేపీ అదే ఫార్ములాతో మళ్లీ అధికారం సాధించింది. ఉత్తరప్రదేశ్ లో 64 సీట్లు, బిహార్ లో 39 సీట్లు సాధించి తానేమిటో నిరూపించుకుంది. ఈ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీలు దారుణంగా ఓటమి పాలయ్యాయి. దీంతో పార్టీలు తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. కులాల వారీగా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి. కులాలను మచ్చిక చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. అగ్రవర్ణాలను సైతం తమ వైపుకు తిప్పుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ లో ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న బ్రాహ్మణుల ఓట్లు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగా పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. రాజపుత్ర కులస్తుడైన యోగీ ఆదిత్యనాథ్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంతో అందరిలో ఆగ్రహం పెరుగుతున్నా ప్రభుత్వానికి గత్యంతరం లేకపోవడంతో ఆయననే కొనసాగిస్తోంది. బ్రాహ్మణ కులదైవం పరశురాముడి జయంతిని ఇటీవల యోగి ప్రభుత్వం రద్దు చేయడం ఆగ్రహం కలిగిస్తోంది.

దీంతో ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణులు యోగిపై కోపంతో బీజేపీకి ఓటు వేయకుండా ఎస్పీకి వేస్తారని అఖిలేష్ యాదవ్ అంచనా వేస్తున్నారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే లఖ్ నపూలో పరశురామ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎస్పీ హామీ ఇస్తోంది. యూపీలో కుల బలం తన ప్రభాం చూపించేందుకు మార్గం కనిపిస్తోంది. అందుకే అధికారం కోసం పార్టీలు వెంపర్లాడుతున్నాయి. బిహార్ లో ఆర్ జేడీ 32 శాతం, జేడీయూ 18 శాతం, బీజేపీకి 15 శాతం ఓటు బ్యాంకు కలిగి ఉన్నాయి. బిహార్ లో కుల సమీకరణ మీదే ఆధారపడి రాజకీయం నడుస్తోంది. కులానికి కాకుండా అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రాధాన్యమిచ్చి పార్టీలు పాటుపడాలని కోరుతున్నారు.