Tollywood Heroine: అలాగే కిరణ్ రాథోడ్ కొన్ని బోల్డ్ సినిమాలలో కూడా నటించింది. బుల్లితెర మీద ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొని హౌస్ లో సందడి చేసింది. కిరణ్ రాథోడ్ ఒకప్పుడు తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ ఇలా అన్ని భాషలలో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కిరణ్ రాథోడ్, జైపూర్ లో పుట్టి పెరిగింది. అయితే ఈమె 2001లో హిందీ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కిరణ్ రాథోడ్ తరుణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నువ్వు లేక నేను లేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఈమె తెలుగులో శ్రీరామ్, నాని, అందరూ దొంగలే దొరికితే, చెప్పవే చిరుగాలి, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, హై స్కూల్, కెవ్వు కేక వంటి పలు సినిమాలలో హీరోయిన్గా అలాగే సెకండ్ హీరోయిన్ గా కూడా కనిపించింది.
Also Read: ఈ స్టార్ కమెడియన్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్.. ఎవరో తెలుసా…
మరికొన్ని తెలుగు సినిమాలలో కిరణ్ రాథోడ్ స్పెషల్ సాంగ్స్ లో కూడా ప్రేక్షకులను అలరించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు తమిళ సినిమాలలో ఎక్కువగా నటించి మెప్పించింది. తమిళ్ స్టార్ హీరోలు కమల్ హాసన్, అజిత్, విజయకాంత్, ప్రశాంత్ వంటి హీరోలతో స్క్రీన్ కూడా షేర్ చేసుకుంది. కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో కూడా పలు సినిమాలలో నటించింది. అయితే కిరణ్ రాథోడ్ 2016 నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కిరణ్ రాథోడ్ హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో నేను ప్రేమించిన వ్యక్తి చెప్పిన మాటలు విని సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యాను.
కానీ నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. దీంతో మళ్లీ నేను సినిమాలలో నటించడానికి రెడీ అయ్యాను, కానీ ఆ సమయంలో కొందరు నన్ను తప్పుగా వాడుకునే ప్రయత్నం చేశారు అడ్జస్ట్ కావాలని అడిగారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. కిరణ్ రాథోడ్ 2016 తర్వాత సినిమాలలో కనిపించలేదు. కానీ ఆమె బుల్లితెర మీద ప్రసారం అయ్యే ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొంది. కానీ ఈమె హౌస్లో అడుగుపెట్టిన వారం రోజులకే ఎలిమినేట్ అయిపోయింది. తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోవడమే ఆమెకు శాతంగా మారిందని చెప్పొచ్చు. తెలుగు రాదనే కారణంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఆమెను నామినేట్ చేయడంతో మొదటి వారంలోనే ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
View this post on Instagram