Motorola Signature: Motorola కంపెనీకి చెందిన చాలా మొబైల్స్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి అలరించాయి. అయితే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ లేటెస్ట్ డివైస్ లను తీసుకొస్తుంది. Motorola Signature అనే మొబైల్ జనవరి 21 న మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో లగ్జరీ ఫీచర్లతో పాటు అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉంది. ప్రీమియం ధర ఉన్నప్పటికీ దీనిని చూసిన వెంటనే కొనుగోలు చేయాలని అనిపిస్తుంది. ఈ మొబైల్ వివరాలు ఎలా ఉన్నాయంటే?
Motorola signature డిజైన్ వేరే లెవల్ అని అనుకోవచ్చు. ఈ మొబైల్ సెవెన్ మిల్లీ మీటర్ల మందం తో ఉండి నాజూకుగా కనిపిస్తుంది. దీని బరువు 186 గ్రాములు ఉండడంతో చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ డిస్ప్లే సూపర్బు అని అంటున్నారు. ఎందుకంటే ఇందులో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లేను అమర్చారు. దీనిపై కార్వింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉండడంతో అనుకోకుండా కిందపడిన లేదా చిన్నపాటి దెబ్బల నుంచి రక్షణ పొందుతుంది. అలాగే ఈ డిస్ప్లే165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇది 6200 నిట్స్ బ్రైట్నెస్ నువ్వు పొందుతుంది. నాణ్యమైన సినిమాలు చూడడానికి, గేమింగ్ కోరుకునే వారికి ఈ డిస్ప్లే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇందులో 8 జెన్ 5 SoC ఉండడంతో 16 జిబి వరకు రామ్ సపోర్ట్ చేయనుంది. 1 TB వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. అదనపు ఫీచర్లు కావాలని కోరుకునే వారికి కూడా కావాల్సిన మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి.
మోటరోలా సిగ్నేచర్ కొత్త మొబైల్ లో కెమెరా పనితీరు మెరుగ్గా ఉండనుంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు. అలాగే 50 MP సెన్సార్ తో కూడిన ఆల్ట్రా వైడ్ కెమెరా ఉండి టెలిఫోటో పనిచేయనుంది. మరో 50 MP ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీడియో కాలింగ్ కోసం కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొబైల్లో బ్యాటరీ వ్యవస్థ కూడా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఇందులో 7000 mAh బ్యాటరీ ఉండగా ఇది 90 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో పనిచేస్తుంది. అలాగే 50 W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఇవ్వరుంది. ఇందులో 16 ఫ్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉండగా అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ మొబైల్ మార్కెట్లోకి వస్తే రూ.59,999 ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.