Motorola Razr Fold: మొబైల్ కొనేటప్పుడు.. కెమెరా, బ్యాటరీ మాత్రమే కాకుండా డిజైన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల ఫోల్డబుల్ మొబైల్స్ కు ఎక్కువగా ఆదరణ పెరుగుతుంది. దీంతో Motorola కంపెనీ ప్రత్యేకంగా కొత్త ఫోల్డబుల్ మొబైల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్స్, బ్యాటరీ సామర్థ్యం వంటివి ఆకర్షిస్తున్నాయి. స్నాప్ డ్రాగన్ 8 జెన్ వంటి సాఫ్ట్వేర్ తో పాటు గొరిల్లా గ్లాస్ తో కూడిన డిజైన్ కలిగిన ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Motorola కంపెనీ నుంచి లేటెస్ట్ గా Razr Fold , అనే మొబైల్ ను లాంచ్ చేసింది. ఇందులో 6.6 అంగుళాల POLED కవర్ డిస్ప్లే కలిగి ఉంది. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇన్నర్ డిస్ప్లే 8.1 అంగుళాల POLED తో కలిగి ఉంది. ఇది 2కె Resolution తో 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీనిపై అల్ట్రాథిన్ గ్లాస్ రక్షణగా ఉంటుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్ సెట్ ను అమర్చారు. 16 జిబి రామ్ తో పని చేసే దీనికి ఏడు సంవత్సరాల వరకు గ్యారెంటీ ఇస్తున్నారు. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 50 MP అల్ట్రా వైడ్ లెన్స్ తో పనిచేస్తుంది. 20 MP సెల్ఫీ తో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది.
ఈ కొత్త మొబైల్ 6000 mAh బ్యాటరీ అమర్చారు. ఇది 80 W వైర్డ్ చార్జింగ్, 50 W wireless చార్జింగ్తో పని చేస్తుంది. ఇందులో మల్టీ స్పెక్ట్రల్ కెమెరా అసిస్టెంట్ సెన్సార్, డాల్ఫి అట్మాస్తో కూడిన స్పీకర్, 5 G కనెక్టివిటీ, యూఎస్బీ టైప్ సి పోర్ట్ ఉన్నాయి. అలాగే ఈ కంపాస్, యాక్సిలరో మీటర్, గైరోస్కోట్, SAR సెన్సార్ వంటివి సౌకర్యవంతంగా ఉండనున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మొబైల్ కావాలని అనుకునే వారితో పాటు.. నేటి తరం యూత్ కు అనుగుణంగా ఈ మొబైల్ ఉండనుంది. అలాగే ఫోల్డింగ్ మొబైల్ అయినందువల్ల రక్షణగా నిలుస్తుంది దీని బరువు 243 గ్రాములు మాత్రమే ఉండడంతో చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే కెమెరాతో ఏఐ తరహాలో ఫోటోలను తీసుకోవచ్చు. వీడియో కాలింగ్ చేసుకునే వారికి ఫ్రంట్ కెమెరా ఫుల్ సపోర్ట్ గా ఉండనుంది.