Motorola Razr 60 Ultra : భారత మార్కెట్‌లోకి త్వరలో పవర్ ఫుల్ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వాళ్లు కాస్త వెయిట్ చేయడం మంచింది. మోటారోలా కంపెనీ త్వరలో ఇండియాలో Motorola Razr 60 Ultraను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సరికొత్త ఫ్లిప్ ఫోన్ ఎప్పుడు విడుదల కానుంది? ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉండనుంది? ఇందులో ఎలాంటి ప్రత్యేకతలు ఉండనున్నాయి? ఈ వివరాలన్నీ ఈ వార్తలో తెలుసుకుందాం.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరామిక్ ప్రొటెక్షన్‌తో రానున్న ఈ ఫోన్‌ను 800K ఫ్లిప్ టెస్టింగ్ చేశారు. కంపెనీ ఈ ఫోన్‌లో టైటానియం హింజ్‌ను అందించింది. ఇది ఫోన్‌ను మరింత క్వాలిటీగా చేస్తుంది. ఈ ఫోన్‌లో Moto AI 2.0 ఫీచర్ల సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ మూడు వేర్వేరు రంగుల్లో కస్టమర్లకు అందుబాటులోకి రాబోతుంది.
Also Read : ఆలసించినా.. ఆశాభంగం.. మోటోరోలా పై భారీ తగ్గింపు.. నేడే త్వరపడండి..
మోటరోలా తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తూ రాబోయే మోటారోలా Razr 60 Ultra విడుదల తేదీని కన్ఫాం చేసింది. కంపెనీ విడుదల చేసిన పోస్ట్ ప్రకారం.. ఈ ఫోన్ వచ్చే వారం అంటే మే 13, 2025న విడుదల కానుంది. ఈ రాబోయే ఫోన్ కోసం అమెజాన్‌లో ప్రత్యేకంగా ఒక మైక్రోసైట్‌ను కూడా రూపొందించారు. దీని ద్వారా ఈ ఫోన్ విడుదల తర్వాత అమెజాన్‌లో విక్రయానికి ఉంటుందని చెప్పింది. అమెజాన్‌లో మాత్రమే కాకుండా ఈ ఫోన్ విడుదల తర్వాత రిలయన్స్ డిజిటల్‌లో కూడా అమ్మకానికి ఉండనుంది.
ఈ ఫోన్ ప్రత్యేకతలు
ప్రాసెసర్: ఈ రాబోయే ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పాటు 16 GB RAM, 512 GB UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది.
కెమెరా: Motorola కంపెనీ ఈ ఫోన్‌లో ప్రపంచంలోనే అత్యంత లేటెస్ట్ కెమెరా సెటప్‌ను అందిస్తుందని పేర్కొంది. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ & మాక్రో, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
ధర గురించి కంపెనీ ప్రస్తుతం ఎటువంటి సూచన ఇవ్వలేదు. అయితే గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్ ధర 1300 డాలర్లు (సుమారు రూ.1,10,248)గా ఉంది. గత సంవత్సరం Razr 50 Ultraను భారతీయ మార్కెట్‌లో రూ.99,999కి విడుదల చేసింది. అయితే Razr 60 Ultra ధర రూ.1.10 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ Samsung Galaxy Z Flip 6కి గట్టి పోటీనిస్తుంది. Z Flip 6 256 GB వేరియంట్ ధర రూ.89,999, 512 GB వేరియంట్ ధర రూ.1,01,999గా ఉంది.
Also Read : మోటారొలా నుంచి కొత్త గాడ్జెట్.. ధర చూస్తే షాకింగే..